Neck Darkness Remedy : మనలో చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నప్పటికి చేతులు, కాళ్లు, మెడ వంటి ఇతర శరీర భాగాలు నల్లగా ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల ఇలా చర్మం నల్లగా మారతుంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా, చర్మం పొడిబారడం వల్ల కూడా చేతులు, కాలు వంటి భాగాల్లో చర్మం నల్లగా మారుతుంది. ముఖం అందంగా కాంతివంతంగా ఉన్నప్పటికి చేతులు, కాళ్లు, మెడ వంటి భాగాలు నల్లగా ఉండి ఇబ్బందులకు గురి అయ్యే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే చర్మానికి తగినంత తేమ అందడం కూడా చాలా అవసరం.
చర్మం తేమగా ఉండాలని చాలా బయట లభించే మాయిశ్చరైజర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. బయట లభించే ఈ మాయిశ్చరైజర్ లను కొనుగోలు చేయడానికి మనం డబ్బును అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అధిక ధరలకు వీటిని కొనుగోలు చేసే పని లేకుండా మన ఇంట్లోనే వీటిని తక్కువ ఖర్చులో తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసుకున్న మాయిశ్చరైజర్ ను ప్రతి రోజూ చర్మానికి రాసుకోవడం వల్ల చర్మానికి తగినంత తేమ లభించి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చే మాయిశ్చరైజర్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనెను వేయాలి. ఆలివ్ నూనెకు బదులుగా మనం బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు.
ఇలా ఆలివ్ నూనెను తీసుకున్న తరువాత ఇందులో 5 చుక్కల గ్లిజరిన్ ను వేసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని, ఒక టీ స్పూన్ కలబంద జెల్ ను వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల మాయిశ్చరైజర్ తయారవుతుంది. దీనిని రోజూ రాత్రి చేతులకు, కాళ్లకు, మెడకు రాసుకోవడం వల్ల చర్మానికి తగినంత తేమ లభించి చర్మం మరలా కాంతివంతంగా తయారవుతుంది. దీనిని వాడడం వల్ల చర్మం పై ఉండే ముడతలు, మృత కణాలు, నలుపుదనం తొలగిపోయి చర్మం అందంగా తయారవుతుంది. ఆలివ్ నూనెలో అలాగే కలబంద జెల్ లో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు అధికంగా ఉంటాయి. ఈ మాయిశ్చరైజర్ ను వాడడం వల్ల చర్మం పై ఎండ వల్ల కలిగిన నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుంది. బయట అధిక ధరలకు కొనుగోలు చేసే పని లేకుండా ఇలా మాయిశ్చరైజర్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు.