Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Meal Maker Curry : ఆలు మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీ ఇలా.. చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..

D by D
January 3, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Meal Maker Curry : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌ను ఉప‌యోగించి కూర‌లు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే ఈ కూర‌లు చాలా రుచిగా కూడా ఉంటాయి. అందులో భాగంగా మీల్ మేక‌ర్ ల‌తో ఎంతో రుచిగా ఉండే ఆలూ మీల్ మేక‌ర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ముక్క‌లుగా చేసిన ఉడికించిన బంగాళాదుంప‌లు – 3, మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన టమాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Meal Maker Curry recipe in telugu tastes better with chapatis
Aloo Meal Maker Curry

మ‌సాలాపేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 3 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 10, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌.

ఆలూ మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత మిల్ మేక‌ర్ ల‌లో ఒక గ్లాస్ నీళ్లు పోసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత మీల్ మేక‌ర్ ల‌లో ఉండే నీటిని పిండేసి వేసుకోవాలి.

త‌రువాత బంగాళాదుంప‌ల‌ను ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, పుల్కా, నాన్, పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేక‌ర్ ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా అప్పుడ‌ప్పుడూ ఈ కూర‌ను కూడా చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Aloo Meal Maker Curry
Previous Post

Onion Juice : ఉల్లిపాయ‌ల‌తో నిజంగానే జుట్టు పెరుగుతుందా.. అస‌లు ఇందులో నిజం ఎంత ఉంది..?

Next Post

Eucalyptus Leaves : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే చెట్టు ఇది.. దీని ఆకుల‌ను మాత్రం త‌ప్ప‌క తెచ్చుకోండి..

Related Posts

vastu

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

May 28, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

May 28, 2025
ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

May 28, 2025
lifestyle

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

May 28, 2025
వినోదం

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

May 28, 2025
వినోదం

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

May 28, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!