Aloo Suji : ఆలుతో ఇలా స్నాక్స్ చేస్తే అస‌లు విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Aloo Suji : మ‌నం బొంబాయితో రవ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బొంబాయి ర‌వ్వ‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ చిరుతిళ్ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ సూజీ స్నాక్స్ గా కూడా ఒక‌టి. ఇవి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. అలాగే ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ ఆలూ సూజీ స్నాక్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ సూజీ స్నాక్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 2, బొంబాయి ర‌వ్వ -ఒక క‌ప్పు, నీళ్లు – 2 క‌ప్పులు, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Aloo Suji snacks recipe in telugu make in this way
Aloo Suji

ఆలూ సూజీ స్నాక్స్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌పై ఉండే పొట్టును తీసేసి వాటిని మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నీళ్లు, ఉప్పు, ప‌సుపు, మిరియాల పొడి వేసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బొంబాయి ర‌వ్వ వేసి క‌ల‌పాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మెత్త‌గా చేసుకున్న బంగాళాదుంప‌ల‌ను వేసి క‌ల‌పాలి. చేతికి నూనె రాసుకుంటూ అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక వ‌త్తుకున్న స్నాక్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆలూ సూజీ స్నాక్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో ర‌వ్వ‌తో ఈ విధంగా రుచిగా స్నాక్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని ముఖ్యంగా పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

D

Recent Posts