సాధారణంగా అరటితో వివిధ రకాలను రెసిపీ చేయడం చూసే ఉంటాం. కానీ అరటి పువ్వుతో ఎంతో కరకరలాడే వడలు చేసుకుని తింటే ఇకపై మరి మరి తినాలి అని భావిస్తారు. మరి ఈ రుచికరమైన ఈ అరటిపువ్వు వడలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
అరటిపువ్వు , శనగపప్పు ఒక కప్పు, గుప్పెడు కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కరివేపాకు, తగినంత ఉప్పు, ఒకటిన్నర స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి 5, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.
తయారీ విధానం
అరటిపువ్వు వడలు చేయాలంటే ముందు రోజు రాత్రి శనగపప్పును నానబెట్టుకోవాలి. నానబెట్టిన శనగపప్పు ను మరుసటి రోజు ఉదయం బాగా శుభ్రంగా చేసి మిక్సీ గిన్నెలోకి శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అదేవిధంగా అరటి పువ్వును చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి జీలకర్ర, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ పై నూనెను బాగా వేడి చేసి నూనె వేడి అయిన తరువాత ఈ మిశ్రమంతో చిన్న చిన్నగా ఆకారం లో వడలుగా వేసుకొని బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకుంటే ఎంతో కరకరలాడే రుచికరమైన అరటిపువ్వు వడలు తయారైనట్లే.