Atukula Pullatlu : అటుకుల‌తో ఎంతో రుచిగా పుల్ల‌ట్లు.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Atukula Pullatlu : అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, ఆహార ప‌దార్థాల‌ను వండుతూ ఉంటాం. అలాగే అటుకుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అటుకుల‌తో చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ అటుకుల దోశ‌ల‌ను మ‌నం మ‌రింత రుచిగా పుల్ల‌టులాగా కూడా వేసుకోవ‌చ్చు. పుల్ల‌టి పెరుగు వేసి చేసే ఈ అటుకుల పుల్ల‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వేస‌వికాలంలో ఇవి చ‌క్క‌టి బ్రేక్ పాస్ట్ అని చెప్ప‌వ‌చ్చు. రుచిగా అటుకుల‌తో పుల్ల‌ట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అటుకుల పుల్ల‌ట్టు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, దొడ్డు అటుకులు – అర క‌ప్పు, మిన‌ప‌గుళ్లు – పావు క‌ప్పు, చిలికిన పుల్ల‌టి పెరుగు – 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌.

Atukula Pullatlu recipe in telugu very tasty
Atukula Pullatlu

అటుకుల పుల్ల‌ట్టు త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అటుకులు, బియ్యం, మిన‌పప్పు తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఇందులో పెరుగు, త‌గిన‌న్ని నీళ్లు పోసుకుని నాలుగు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఈ అటుకుల‌ను అందులో ఉండే మ‌జ్జిగ‌తోనే జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ పిండిని రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి పులిసిన త‌రువాత ఉప్పు, అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని అట్టులాగా వేసుకోవాలి. దోశ క్రిస్పీగా కావాల‌నుకున్న వారు ప‌లుచ‌గా వేసుకోవ‌చ్చు. త‌రువాత నూనె వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పుల్ల‌ట్టు త‌యారవుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పెరుగు వేసి చేసిన ఈ పుల్ల‌ట్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts