viral news

బదోని సూపర్ క్యాచ్.. వీడియో వైరల్..!

ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 లో భారత్ ఏ టీం వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. అల్ అమేరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్లు తేడాతో గెలిచింది.

టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్ ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. ఆయుష్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన విన్యాసంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ లాస్ట్ బాల్ ని జవదుల్లాకు లెగ్ స్టంప్ లైన్ దిశగా ఫుల్ డెలివరీని చేశారు.

badoni catch video viral

దీంతో భారీ షాట్ ఆడారు. బౌండరీ పక్కా అనుకున్నాడు. అందరూ కూడా అదే అనుకున్నారు. కానీ అది అంతా తారుమరైపోయింది. వైడ్ లాంగ్ పొజిషన్ నుంచి పరిగెత్తుకొని బదోని గాలిలో డ్రైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నారు. ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

Peddinti Sravya

Recent Posts