Baingan Bharta : వంకాయ‌ల‌తో చేసే ఈ కూర‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. బాగుంటుంది..

Baingan Bharta : వంకాయ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వంకాయ‌ల‌తో ఎన్నో కూర‌ల‌ను చేస్తుంటారు. వంకాయ వేపుడు, పులుసు, ప‌చ్చ‌డి, ప‌ప్పు.. ఇలా ఏది చేసినా భ‌లే రుచిగా ఉంటుంది. ఇక గుత్తి వంకాయ కూర‌ను కూడా చేస్తారు. ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే వంకాయ‌ల‌తో బైంగ‌న్ బ‌ర్తాను కూడా చేయ‌వ‌చ్చు. చాలా మందికి దీని గురించి తెలియ‌దు. కానీ ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే మాత్రం విడిచిపెట్ట‌రు. ఎంతో రుచిగా ఉంటుంది. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బైంగ‌న్ బ‌ర్తా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంకాయ‌లు – 600 గ్రాములు, ఉల్లిపాయ ముక్క‌లు – 100 గ్రాములు, ట‌మాటా ముక్క‌లు – 100 గ్రాములు, త‌రిగిన అల్లం – 20 గ్రాములు, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 50 గ్రాములు, కారం పొడి – 50 గ్రాములు, ఆముదం నూనె – 50 ఎంఎల్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా.

Baingan Bharta recipe in telugu how to make it know the method
Baingan Bharta

బైంగ‌న్ బ‌ర్తాను త‌యారు చేసే విధానం..

వంకాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి వాటికి నూనె రాసి వేపుడికి సిద్ధంగా పెట్టుకోవాలి. పాన్‌లో వంకాయ‌ల‌ను రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు వంకాయ‌ల పైన తొక్క‌ను తీసేసి వాటిని ముక్క‌లుగా క‌ట్ చేయాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం వేయాలి. ఉల్లిపాయ ముక్క‌లు బంగారు రంగులోకి మారిన త‌రువాత వంకాయ ముక్క‌ల పేస్ట్ వేయాలి. ట‌మాటా ముక్క‌లు, ఉప్పు, ఆముదం నూనె వేయాలి. కొద్దిసేపు మంట మీద ఉంచాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లి దింపేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన బైంగ‌న్ బ‌ర్తా రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు దేంతో అయినా తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి ట్రై చేస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు.

Share
Editor

Recent Posts