Beerapottu Pachi Karam : కమ్మ‌ని బీర‌పొట్టు ప‌చ్చికారం.. ఒక్క‌సారి అయినా స‌రే ట్రై చేయండి..!

Beerapottu Pachi Karam : మ‌నం బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బీరకాయ‌ల‌తో చేసే వంటకాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బీర‌కాయ‌ల‌తోనే కాకుండా బీర‌పొట్టుతో కూడా మ‌నం ప‌చ్చడిని త‌యారు చేస్తూ ఉంటాము. బీర‌పొట్టుతో ప‌చ్చ‌డినే కాకుండా మ‌నం కారంపొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బీర‌పొట్టుతో చేసే ఈ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ కారంపొడిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం.చాలా మందిబీర‌కాయ పొట్టును ప‌డేస్తూ ఉంటారు. కానీ బీర‌కాయ పొట్టులో ఎన్ఓ పోష‌కాలు, ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క‌నుక దీనిని కూడా ఆహారంగా తీసుకోవ‌చ్చు. మ‌న‌కు ఎంతో మేలు చేసే బీర‌కాయ పొట్టుతో కారంపొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌పొట్టు ప‌చ్చికారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బీర‌కాయ‌లు – అర‌కిలో, ప‌ల్లీలు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 5 లేదా 6, నూనె – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు – అర టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 5, ఇంగువ – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – కొద్దిగా.

Beerapottu Pachi Karam recipe in telugu taste once must do this
Beerapottu Pachi Karam

బీర‌పొట్టు ప‌చ్చికారం పొడి త‌యారీ విధానం..

ముందుగా బీరకాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి వాటి పొట్టును తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత పొట్టు తీసి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో నువ్వులు, ధ‌నియాలు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. ముందుగా వీటిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత ప‌ల్లీలు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో ముందుగా ప‌చ్చిమిర్చి వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత బీర‌కాయ పొట్టు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇది మ‌రీ మెత్త‌గా కాకుండా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మ‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఇంగువ‌, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న బీర పొట్టు వేసి వేయించాలి. దీనిని క‌లుపుతూ పూర్తిగా వేయించిన త‌రువాత ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌పొట్టు ప‌చ్చికారం పొడి త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బీరపొట్టుతో తయారు చేసిన ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts