వినోదం

సోనియాకి ఆల్రెడీ పెళ్లైందా.. ఆ మేట‌ర్ దాచి ఈ ల‌వ్ ఎఫైర్స్ ఏంది?

బిగ్ బాస్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన భామ సోనియా ఆకుల‌. ఈమెగ‌తంలో ప‌లు సినిమాల‌లో న‌టించిన పెద్ద‌గా పేరు సంపాదించుకోలేక‌పోయింది. అయితే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్ట‌డంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది.ఈమె చర్యలు విభిన్నంగా ఉంటున్నాయి. తోటి హౌజ్‌మేట్స్ అయిన‌ పృథ్విరాజ్, నిఖిల్ తో సన్నిహితంగా ఉంటుంది. ఒకరిని చిన్నోడా మరొకరిని పెద్దోడా అంటూ వాళ్లతో ఆమె ప్రవర్తించే తీరు కాస్త‌ ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక ప్రేమికురాలిని తలపించేలా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉంటుండ‌డంతో సోనియాపై నెగెటివిటీ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా సోనియాతో హౌస్ లో చనువుగా ఉంటోన్న నిఖిల్, పృథ్వీలతో ఆమెకు రిలేషన్ అంటగడుతున్నారు.

ఈ క్ర‌మంలో సోనియా త‌ల్లిదండ్రులు సోనియా గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూకు హాజరైన మల్లీశ్వరి- చక్రపాణి తమ కూతురిని బద్నాం చేయవద్దని వేడుకున్నారు.’బిగ్ బాస్ లో మా అమ్మాయి బాగా ఆడుతోంది కాబ‌ట్టే కొందరు తననే టార్గెట్‌ చేస్తున్నారు. మా అమ్మాయిని ఎందుకలా బద్నాం చేస్తున్నారో ఇప్ప‌టికీ నాకు అర్ధం కావ‌డం లేదు. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి ఎన్ జీవోను స్థాపించి ఎంతోమందికి సాయం చేసింది.అలా వచ్చిన పేరుతోనే సినిమా అవకాశాలు సంపాదించుకుంది. ఇదే క్రమంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఈ ట్రోలింగ్‌ చూస్తుంటే.. నా కూతురు సంపాదించుకున్న మంచి పేరు పోతుందేమోనని చాలా బాధ‌గా ఉంది.

bigg boss sonia is she already married

పృథ్విరాజ్, నిఖిల్ లను సోనియా చిన్నోడు, పెద్దోడు అంటుంది అంటే దానర్థం చిన్న అన్నయ్య, పెద్ద అన్నయ్య అని. లైవ్ లో ఈ విషయం చెప్పింది. కానీ ఎపిసోడ్లో చూపించలేదు. సోనియా నాకు తల్లితో సమానం అని నిఖిల్ చెప్పాడు. అది కూడా చూపించలేదు అని వారు తెలిపారు. అయితే సోనియా తల్లిదండ్రుల మాటలతో ఓ విషయం క్లారిటీ వచ్చింది. సోనియాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశారట. కాబోయే భర్త అనుమతితో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. కానీ సోనియా మాత్రం ఈ విషయం బయటపెట్టలేదు. హౌస్లో ఎవరితో చెప్పలేదు. అందుకు కార‌ణం పెళ్లి కుదిరిన త‌ర్వాత ఇలా అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటే మరింత ట్రోలింగ్ ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. గేమ్ ఎంత బాగా ఆడినా తేడా కొడుతుంది. అందుకే పెళ్లి విషయం సోనియా దాచి ఉండొచ్చు అని కొంద‌రు భావిస్తున్నారు.

Sam

Recent Posts