Cabbage Pakoda : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా క్యాబేజీ ప‌కోడీల‌ను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Pakoda : క్యాబేజితో మ‌నం కూర‌లు, వేపుళ్లే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసేకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో క్యాబేజి ప‌కోడా కూడా ఒక‌టి. క్యాబేజి ప‌కోడాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. క్యాబేజితో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇంట్లో క్యాబేజి ఉంటే చాలు ఈ ప‌కోడాల‌ను చిటికెలో త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉడే ఈ క్యాబేజి ప‌కోడాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి ప‌కోడా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాబేజి – చిన్న‌ది ఒక‌టి, స‌న్న‌గా పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – అర కప్పు, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, వేడి నూనె – ఒక టేబుల్ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్.

Cabbage Pakoda recipe very easy to make and tasty
Cabbage Pakoda

క్యాబేజి ప‌కోడా త‌యారీ విధానం..

ముందుగా క్యాబేజిని చిన్న చిన్న ముక్క‌లుగా లేదా స‌న్న‌గా తురుముకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి బాగా క‌ల‌పాలి. ఇందులో నీళ్లు పోయ‌కుండా క్యాబేజిలో ఉండే నీటితోనే బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాబేజి మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసుకోవాలి. ఈ ప‌కోడాల‌ను అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి ప‌కోడా త‌యార‌వుతుంది. దీనిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ప‌కోడాల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts