Laughing Buddha : లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని గిఫ్ట్‌గానే తీసుకోవాలా..? మనం మన సొంత డబ్బులతో కొని ఇంట్లో పెట్టుకోకూడదా..?

Laughing Buddha : భారతీయ పురాతన వాస్తు శాస్త్రం అంటే చాలా మందికి ఎంత నమ్మకమో.. చైనీస్‌ వాస్తు అన్నా చాలా మంది అలాగే విశ్వసిస్తారు. ముఖ్యంగా చైనీయుల వాస్తు ప్రకారం ఇంట్లో లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే లక్‌ కలసి వస్తుందని అంటుంటారు. అయితే లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని మన సొంతంగా మనం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చా.. అన్న సందేహాలు కలుగుతుంటాయి. దీంతో చాలా మంది దీన్ని ఇతరులచే కొన్ని గిఫ్ట్‌లుగా ఇప్పించుకుంటుంటారు. అయితే దీనిపై వాస్తు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ విగ్రహం ఇంట్లో ఉండడం వల్ల నెగెటివ్‌ ఎనర్జీ పోయి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. దీన్ని హాల్‌ లో పెడితే కుటుంబ సభ్యుల సమస్యలు పోతాయి. బెడ్‌రూమ్‌లో పెడితే దంపతుల మధ్య కలహాలు తగ్గుతాయి. ఇలా ఈ విగ్రహాన్ని పెట్టే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా మారుతుంటాయి. అయితే లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని మనకు మనం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చా.. అంటే.. అవును.. పెట్టుకోవచ్చనే నిపుణులు చెబుతున్నారు.

can we buy Laughing Buddha statue on our own can we buy Laughing Buddha statue on our own
Laughing Buddha

లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని కేవలం గిఫ్ట్‌గానే అందుకోవాలని.. మనకై మనం కొనుక్కోవద్దని చాలా మంది నమ్ముతారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇది మనకు మేలు చేసే విగ్రహమే. కనుక దీన్ని మనకు మనం కొనుగోలు చేయవచ్చు. ఇతరులే మనకు గిఫ్ట్‌గా ఇవ్వాలనే రూల్‌ ఎక్కడా లేదు. కాబట్టి ఎవరైనా సరే తమ సొంత డబ్బుతో ఈ విగ్రహాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సమస్యల నుంచి విముక్తులు అవుతారు. చేతిలో డబ్బు నిలుస్తుంది. కాబట్టి ఈ విగ్రహాన్ని కొని ఇంట్లో పెట్టుకునే విషయంలో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు.

D

Recent Posts