Chiranjeevi : ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి మొదట నటించిన చిత్రం పునాదిరాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. 80’s, 90’s లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీని ఏలాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. రీ ఎంట్రీ తరువాత కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు చిరంజీవి పేరు మారు మ్రోగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారు..? ఆయన లుక్ ఎలా ఉండేది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. గతంలో చిరంజీవి చిన్నప్పటి మిత్రుడు అప్పట్లో చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్ తో ఆయన చాలా క్లోజ్. ఒంగోలులో తాము డిగ్రీ చదివేటప్పుడు ఫోటో అని భద్రంగా దాచుకున్న ఫోటోను చూపించాడు. యవ్వనంలో ఉన్న చిరంజీవి ఫోటో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను కేతంరెడ్డి, వినోద్‌రెడ్డి గతంలో ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.