Carrot Kalakand : క్యారెట్లతో ఎంతో రుచిగా ఉండే కలాకంద్‌ తయారీ.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Carrot Kalakand : క్యారెట్లు అనగానే మనకు వాటి ఆకర్షణీయమైన రంగు ముందుగా గుర్తుకు వస్తుంది. అవి చూడచక్కని నారింజ రంగులో మెరిసిపోతుంటాయి. అందుకనే చాలా మంది వాటిని పచ్చిగా తింటుంటారు. వీటిని వంటల్లోనూ వేస్తుంటారు. క్యారెట్‌తో చేసే ఏ వంటకం అయినా సరే రుచి అదిరిపోతుంది. ఇక క్యారెట్లతో పలు రకాల స్వీట్లను కూడా చేయవచ్చు. అయితే మీకు తెలుసా.. క్యారెట్లతో ఎంతో రుచిగా ఉండే కలాకంద్‌ను కూడా చేసుకోవచ్చు. అవును.. ఇది స్వీట్‌ షాపుల్లోనే లభిస్తుంది. కానీ కాస్త ఓపిక ఉంటే ఇంట్లోనే దీన్ని ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే క్యారెట్‌ కలాకంద్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్‌ కలాకంద్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

క్యారెట్లు – అర కిలో, యాలకుల పొడి – ఒక టీస్పూన్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 200 గ్రాములు, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, చిక్కని పాలు – ఒక లీటర్‌, నిమ్మరసం – టేబుల్‌ స్పూన్‌, పిస్తా, జీడిపప్పు – అలంకరణకు సరిపడా.

Carrot Kalakand recipe in telugu make in this way
Carrot Kalakand

క్యారెట్‌ కలాకంద్‌ను తయారుచేసే విధానం..

మందపాటి గిన్నెలో పాలు పోసి మరిగించాలి. తరువాత నిమ్మరసం పిండి విరగ్గొట్టాలి. ఇప్పుడు పాలన్నీ పూర్తిగా విరిగిపోయిన తరువాత పలుచని బట్టలో వేసి వడకట్టాలి. తరువాత దీన్ని సంచిలా కట్టి ట్యాప్‌కు వేలాడదీయడం కానీ లేదా దాని మీద బరువు పెట్టి గానీ ఉంచాలి. క్యారెట్లను గ్రేటర్‌తో తురుముకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి తురిమిన క్యారెట్‌ వేసి వేయించాలి. తరువాత కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా ఉడికిన తరువాత పాల విరుగుడు కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక యాలకుల పొడి వేసి కలిపి దించాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో మిశ్రమాన్ని వేసి పిస్తా, జీడిపప్పు ముక్కలు చల్లాలి. ఆరాక ఫ్రిజ్‌లో నాలుగైద గంటలు పెట్టి, బయటకు తీసి ముక్కలుగా కట్‌ చేయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే క్యారెట్‌ కలాకంద్‌ రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా తక్కువ సమయంలోనే దీన్ని తయారు చేయవచ్చు. కనుక క్యారెట్లతో ఒక్కసారి దీన్ని్ ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది.

Editor

Recent Posts