Cauliflower Rice : కాలిఫ్ల‌వ‌ర్ రైస్‌ను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Cauliflower Rice : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే రైస్ వెరైటీల‌లో క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బ‌యట తినే ప‌ని లేకుండా ఈ ఫ్రైడ్ రైస్ ను అదే రుచితో అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బాస్మ‌తీబియ్యం – 100 గ్రా., క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – 2 క‌ప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – తగినంత‌, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లి త‌రుగు – అర క‌ప్పు, స్ప్రింగ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్,త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 2, ప‌చ్చిబఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, క్యాబేజి త‌రుగు – పావు క‌ప్పు, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్.

Cauliflower Rice recipe in telugu make in this method
Cauliflower Rice

క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో క్యాలీప్ల‌వ‌ర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదాపిండి, ఫుడ్ క‌లర్ వేసిక‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీటిని పోసిమ‌సాలాలు ముక్క‌లకు ప‌ట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత వీటిని నూనెలో వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ‌, స్ప్రింగ్స్ ఆనియ‌న్స్ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత బీన్స్, బ‌ఠాణీ, క్యాబేజి త‌రుగు వేసి వేయించాలి.

వీటిని చ‌క్క‌గా వేయించిన త‌రువాత ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, వెనిగ‌ర్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత అన్నంవేసి క‌ల‌పాలి. త‌రువాత పెద్ద మంట‌పై అంతా క‌లిసేలా టాస్ చేసుకుని చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా క్యాలీప్ల‌వ‌ర్ తో రెస్టారెంట్ స్టైల్ ప్రైడ్ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts