Cheepuru : మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లక్ష్మీ దేవి మన ఇంటి నుండి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే స్థిరంగా ఉండడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మన ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరంగా ఉండడం వల్ల మన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. మన ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయి. మన ఇంట్లోని వారికి అన్నీ శుభాలే కలుగుతాయి. అదే విధంగా మనం ప్రతిరోజూ ఇంటిని రెండు సార్లు ఊడుస్తూ ఉంటాం. శుచిగా ఉంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టం. మనం ఊడ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ , ఒక చిన్న మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీ దేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. మనం ఆర్థికంగా కూడా నిలదొక్కుకుంటాం.
ఇంటిని ఊడ్చేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి.. మనం ఏ మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీ దేవి మన ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉంటుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ దేవి మన ఇంట్లోకి రావాలంటే మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని తప్పకుండా రెండు సార్లు ఊడుస్తూ ఉండాలి. ఉదయం పూట ఇంటిని ఊడ్చేటపుడు సింహద్వారం నుండి వెనుక వైపుకు ఊడవాలి. అలాగే వెనుక వైపు నుండి సింహద్వారం వైపు సాయంత్రం పూట ఊడవాలి.
అదేవిధంగా చీపురును మనం లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. చీపురును ఎప్పుడూ తన్నడం కానీ, తొక్కడం కానీ చేయకూడదు. అలాగే చీపురుపై నుండి దాటకూడదు. ఎప్పుడూ కూడా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో సింహద్వారాన్ని మూసి ఉంచకూడదు. చాలా మంది సింహద్వారాన్ని మూసి వెనుక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ సమయాలలో లక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ సమయాలలో కచ్చితంగా సింహద్వారాన్ని తెరిచే ఉంచాలి. ఆ తరువాత మనం ఇంటిని ఊడ్చే ముందు శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు లేదా ఐదు సార్లు జపించి ఆ తరువాత ఇంట్లో ఊడ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో నుండి లక్ష్మీ దేవి బయటకు బయటకు వెళ్లకుండా స్థిరంగా ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఆయురారోగ్యాలు, సిరి సంపదలు నెలకొంటాయి.