Shanaga Pappu Bellam Payasam : శ‌న‌గ‌ప‌ప్పు బెల్లం పాయ‌సం.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Shanaga Pappu Bellam Payasam : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లో పాయ‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పాయ‌సం ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. అయితే మ‌నం వంటింట్లో వాడే ప‌ప్పు దినుసుల‌ల్లో ఒక‌టైన శ‌న‌గ‌ప‌ప్పును ఉప‌యోగించి కూడా మ‌నం పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పు కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌న‌గ‌ప‌ప్పుతో పాయ‌సాన్ని చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ పాయ‌సాన్ని త‌యారు చేయ‌డం కూడా చాలా సులువు. ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌ప‌ప్పు పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌న‌గ‌ప‌ప్పు బెల్లం పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు – ఒక క‌ప్పు, నాన‌బెట్టిన బియ్యం – అర క‌ప్పు, యాల‌కులు – 4, బెల్లం – 200 గ్రా., ఉప్పు – చిటికెడు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు ప‌లుకులు – ఒక టేబుల్ స్పూన్, బాదం ప‌లుకులు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – నాలుగు క‌ప్పులు.

Shanaga Pappu Bellam Payasam very tasty and healthy recipe is here
Shanaga Pappu Bellam Payasam

శ‌న‌గ‌ప‌ప్పు బెల్లం పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా ఒక రోట్లో లేదా జార్ లో నానబెట్టుకున్న బియ్యాన్ని, యాల‌కుల‌ను వేసి మెత్త‌గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే రోట్లో బెల్లాన్ని కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పును, నాలుగు క‌ప్పుల నీళ్ల‌ను పోసి ఉడికించుకోవాలి. శ‌న‌గ‌ప‌ప్పును ఉడికించేట‌ప్పుడు పొంగ‌కుండా అందులో అర టీ స్పూన్ నూనెను వేసుకోవాలి. శ‌న‌గ‌ప‌ప్పు ఉడికిన త‌రువాత అందులో బెల్లాన్ని వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ముందుగా దంచి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నెయ్యిని వేసి నెయ్యి క‌రిగిన త‌రువాత ఎండు కొబ్బ‌రి ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ఎండు ద్రాక్ష‌ను, జీడిప‌ప్పును, బాదం ప‌ప్పును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు మిశ్ర‌మంలో వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌ప‌ప్పు బెల్లం పాయ‌సం త‌యార‌వుతుంది. తీపి ప‌దార్థాలు తినాల‌నిపించిన‌ప్పుడు చాలా సులువుగా ఇలా శ‌న‌గ‌ప‌ప్పుతో పాయ‌సాన్ని చేసుకుని తిన‌వ‌చ్చు. త‌ర‌చూ చేసే పాయ‌సానికి బ‌దులుగా ఇలా శ‌న‌గ‌ప‌ప్పుతో కూడా పాయ‌సాన్ని చేసుకోవ‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంత‌మ‌వుతుంది.

Share
D

Recent Posts