Chettinad Aloo Fry : ఆలు ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Chettinad Aloo Fry : ఆలూ ఫ్రై.. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ ఆలూ ఫ్రైను ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చెట్టినాడు స్టైల్ లో చేసే ఈ ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే ఆలూ ఫ్రై కంటే ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా చెట్టినాడు స్టైల్ లో ఆలూ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టినాడు ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, ఆవాలు – ఒక టీస్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప‌లు – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌.

Chettinad Aloo Fry recipe make in this method
Chettinad Aloo Fry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 5, అనాస పువ్వు – 1, మిరియాలు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, మ‌రాఠీ మొగ్గ – స‌గం ముక్క‌, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్.

చెట్టినాడు ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత బంగాళాదుంపల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. ఈ ముక్క‌ల‌ను 18 నుండి 20 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నుండి 4 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చెట్టినాడు ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts