Chicken Cheekulu : హోట‌ల్‌లో ల‌భించే లాంటి రుచితో చికెన్ చీకుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Chicken Cheekulu : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ చీకులు కూడా ఒక‌టి. వీటినే చికెన్ స్టిక్స్ అని కూడా అంటారు. ఈ చికెన్ చీకులు చాలా రుచిగా ఉంటాయి. మెత్త‌గా, జ్యూసీగా ఉండే ఈ చికెన్ చీకుల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే రెస్టారెంట్ కు వెళ్లే ప‌ని లేకుండా ఈ చికెన్ చీకుల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని చేయ‌డం చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సుల‌భంగా చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ చీకుల‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ చీకుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చీకులు – అర‌కిలో, ప‌చ్చిమిర్చి – 8 లేదా కారానికి త‌గిన‌న్ని, కొత్తిమీర – గుప్పెడు, పుదీనా – గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, నెయ్యి – ఒక టీ స్పూన్.

Chicken Cheekulu recipe in telugu make in this way
Chicken Cheekulu

చికెన్ చీకుల త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వాటిని శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక జార్ లో ప‌చ్చిమిర్చి, కొత్తిమీర‌, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను చికెన్ లో వేసి క‌ల‌పాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపుతో పాటు మిగిల‌న ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత చికెన్ పై మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిక్స్ ను తీసుకోవాలి. ఈ స్టిక్స్ నే స్కివ‌ర్స్ అని కూడా అంటారు. ఇలా స్టిక్స్ ను తీసుకుని వాటికి చికెన్ ముక్క‌లను గుచ్చాలి. చికెన్ ముక్క‌ల మ‌ధ్య సందు ఉండేలా చూసుకోవాలి. త‌రువాత గ్రిల్ పెనం మీద సాధార‌ణ క‌ళాయిలోముందుగా నూనె లేదా నెయ్యి వేసుకోవాలి.

నెయ్యి వేడ‌య్యాక చికెన్ స్టిక్స్ ను దానిపై ఉంచి మూత పెట్టాలి. వీటిని చిన్న మంట‌పై కాల్చుకోవాలి. చికెన్ ముక్క‌లు ఒక‌వైపు వేగిన త‌రువాత మూత తీసి వాటిని మ‌రో వైపుకు తిప్పుకోవాలి. త‌రువాత మూత పెట్టి కాల్చుకోవాలి. ఇలా చికెన్ అన్ని వైపులా చ‌క్క‌గా వేగిన త‌రువాత ఈ స్టిక్స్ ను ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ చీకులు త‌యార‌వుతాయి. వీటిని రైతా, మ‌యోనీస్, నిమ్మ‌ర‌సం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా చికెన్ చీకుల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts