Chinthakaya Chepala Pulusu : చింత‌కాయ‌ చేప‌ల పులుసు ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Chinthakaya Chepala Pulusu : చేప‌ల పులుసు ఎంత రుచిగా ఉంటుందో మన‌కు తెలిసిందే. చేప‌ల పులుసును ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది చేప‌ల పులుసును లొట్ట‌లేసుకుంటూ తింటారు. సాధార‌ణంగా ఈ చేప‌ల పులుసును త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం చింత‌పండును లేదా ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా మ‌నం ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో కూడా చేప‌ల పులుసును త‌యారు చేసుకోవ‌చ్చు. గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ‌గా చేసే ఈ చింత‌కాయ‌ల చేప‌ల పులుసు కూడా చాలా రుచిగాఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ చింత‌కాయ‌ల చేప‌ల పులుసును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌రింత క‌మ్మ‌గా, మ‌రింత రుచిగా ఈ చింత‌కాయ‌లతో చేప‌ల పులుసును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చింతకాయ చేప‌ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – కిలోన్న‌ర‌, ప‌చ్చి చింత‌కాయ‌లు – పావుకిలో, మెంతులు – 10 గింజ‌లు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌కర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, నూనె – అర క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, బెల్లం – చిన్న ముక్క‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్.

Chinthakaya Chepala Pulusu recipe in telugu very tasty
Chinthakaya Chepala Pulusu

చింతకాయ చేప‌ల పులుసు త‌యారీ విధానం..

ముందుగా చేప ముక్క‌ల‌ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, కారం, కొద్దిగా ప‌సుపు వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ చేప ముక్క‌ల‌పై మూత పెట్టి ఒక గంట‌పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత చింతకాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో రెండున్న‌ర గ్లాసుల నీళ్లు పోసి చింత‌కాయ‌ల‌ను ఉడికించాలి. చింత‌కాయ‌లు ఉడికిన త‌రువాత వాటిపై ఉండే చెక్కును తీసేసి చేత్తో పిండుతూ గుజ్జును తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే ఆజ‌ర్ లో ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి.

త‌రువాత మ‌ట్టి క‌ళాయిలో లేదా స్టీల్ క‌ళాయిలో నూనెవేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, బెల్లం వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు గుజ్జు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. పులుసు మ‌రిగిన త‌రువాత చేప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి చిన్న మంట‌పై 20 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రరువాత మూత తీసి ప‌చ్చిమిర్చి, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి, బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ చేప‌ల పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కం చేప‌ల పులుసు కాకుండా చింత‌కాయలు దొరికిన‌ప్పుడు ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts