Chocochip Cookies : మనకు బేకరీలల్లో లభించే వాటిల్లో కప్ కేక్స్ కూడా ఒకటి. కప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి . పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లోకి, పార్టీస్ లో సర్వ్ చేసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ కప్ కేక్స్ ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాల సులభం. ఇంట్లో ఒవెన్ లేకపోయినా కూడా ఈ కప్ కేక్స్ ను తయారుచేసుకోవచ్చు. బేకరీ స్టైల్ చాకో చిప్స్ కప్ కేక్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాకో చిప్స్ కప్ కేక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – అర కప్పు, ఇన్ స్టాంట్ కాఫీ పౌడర్ – ఒకటిన్నర టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్, నూనె లేదా కరిగిన బటర్ – 1/3 కప్పు, మైదాపిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, వంటసోడా – అర టీ స్పూన్.
చాకో చిప్స్ కప్ కేక్స్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కాఫీ పౌడర్, నెయ్యి వేసికలపాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోసి కలపాలి. దీనిని బాగా బీట్ చేసుకున్న తరువాత బటర్ వేసి కలపాలి. తరువాత గిన్నెపై జల్లెడను ఉంచి అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత కప్ కేక్స్ ట్రేను తీసుకుని అందులో కప్ కేక్స్ ను ఉంచాలి. తరువాత అందులో సగం వరకు కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత వీటిపై చాకో చిప్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి. కప్ కేక్స్ లేని వారు పేపర్ టీ గ్లాస్ లల్లో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. అలాగే స్టీల్ గిన్నెలల్లో కూడా కేక్స్ ను తయారు చేసుకోవచ్చు.
ఇలా కప్ కేక్స్ ను తయారు చేసుకున్న తరువాత వీటిని ఒవెన్ లో ఉంచి 170 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఒవెన్ లేని వారు వెడల్పుగా ఉండే గిన్నెలో ఇసుక లేదా ఉప్పు వేసి సమానంగా చేసుకోవాలి. తరువాత ఇందులో స్టాండ్ ను ఉంచి ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత స్టాండ్ పై టీ గ్లాసులను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని బయటకు తీసి చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాకో చిప్స్ కప్ కేక్స్ తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.