Coconut Biscuits : కేవ‌లం 4 ప‌దార్థాల‌తోనే ఎంతో రుచిక‌ర‌మైన కొబ్బ‌రి బిస్కెట్ల‌ను ఇలా చేయండి..!

Coconut Biscuits : మ‌న‌కు బేక‌రీల్ల‌లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో కొకోన‌ట్ బిస్కెట్లు కూడా ఒక‌టి. కొకోన‌ట్ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని కొనుగోలు మ‌రీ తింటూ ఉంటారు. పిల్ల‌లు ఈ బిస్కెట్ల‌ను మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ కొకోన‌ట్ బిస్కెట్ల‌ను అదే రుచితో అంతే గుల్ల‌గుల్ల‌గా మ‌నం ఇంట్లో కూడా త‌యారుచేసుకోవ‌చ్చు. ఈ బిస్కెట్ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బేక‌రీల‌ల్లో ల‌భించే కొకోన‌ట్ బిస్కెట్ల‌ను అదే రుచితో మ‌నం ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొకోన‌ట్ బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – 100 గ్రా., పంచ‌దార పొడి – 50 గ్రా., గ‌ది ఉష్ణోగ్ర‌త వద్ద ఉన్న‌ బ‌ట‌ర్ – 80 గ్రా., ఎండు కొబ్బ‌రి పొడి – 20 గ్రా..

Coconut Biscuits recipe in telugu make in this way
Coconut Biscuits

కొకోన‌ట్ బిస్కెట్ల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో జ‌ల్లెడ‌ను ఉంచి అందులో మైదాపిండి,పంచ‌దార పొడి వేసి జ‌ల్లించాలి. త‌రువాత జ‌ల్లెడు తీసేసి ఇందులో బ‌ట‌ర్ వేసి బాగా క‌ల‌పాలి. నీళ్లు వేయ‌కుండా పిండి అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత ఎండు కొబ్బ‌రి పొడి వేసి క‌ల‌పాలి. అంతా క‌లిసేలా కలుపుకున్న త‌రువాత ఈ పిండిని మూత ఉండే డ‌బ్బాలో ఉంచి 24 గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. త‌రువాత పిండిని బ‌య‌ట‌కు తీసి మ‌రో 5 నిమిషాల పాటు బాగా వ‌త్తుకోవాలి. త‌రువాత చ‌పాతీ కర్ర‌తో మందంగా వ‌త్తుకోవాలి. త‌రువాత కుక్కీ క‌ట్ట‌ర్ తో లేదా అంచులు ప‌దునుగా ఉండే గిన్నెతో బిస్కెట్ల ఆకారంలో క‌ట్ చేసుకోవాలి.

త‌రువాత ట్రేను తీసుకుని దానిపై పొడి పిండిని చ‌ల్లుకుని బిస్కెట్ల‌ను ట్రేలో ఉంచాలి. ఈ బిస్కెట్ల‌పై మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో డిజైన్ చేసుకోవ‌చ్చు. త‌రువాత ఈ ట్రేను ఫ్రీహీట్ చేసిన ఒవెన్ లో ఉంచి 180 డిగ్రీల వ‌ద్ద 18 నుండి 22 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. త‌రువాత వీటిని బ‌య‌ట‌కు తీసి చ‌ల్లారిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా గుల్ల గుల్ల‌గా ఉండే కొకోన‌ట్ బిస్కెట్లు త‌యార‌వుతాయి. ఈ విధంగా త‌యారు చేసిన బిస్కెట్ల‌ను గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వల్ల మెత్త‌బ‌డ‌కుండా చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి.

D

Recent Posts