Coconut Ice Cream : మనలో చాలా మంది ఐస్ క్రీమ్ ను ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఐస్ క్రీమ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు రకరకాల ఐస్ క్రీమ్స్ బయట లభిస్తూ ఉంటాయి. వాటిల్లో కొకోనట్ ఐస్ క్రీమ్ కూడా ఒకటి. ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ఐస్ క్రీమ్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అదే రుచితో అదే మృదుత్వంతో ఈ ఐస్ క్రీమ్ ను మం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ కొకోనట్ ఐస్ క్రీమ్ ను మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి బోండాల్లో ఉండే లేత కొబ్బరి – ముప్పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ – ఒక లీటర్, కండెన్స్డ్ మిల్క్ – 400 ఎమ్ ఎల్.
కొకోనట్ ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా కొబ్బరిని జార్ లో వేసి 4 సెకన్ల పాటు మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఫ్రెష్ క్రీమ్ ను 4 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా ఉంచడంలో వల్ల గట్టిగా ఉండే క్రీమ్ పైకి నీళ్లు కిందికి అవుతాయి. గ్టటిగా ఉండే క్రీమ్ ను అర లీటర్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత హ్యండ్ బ్లెండర్ సహాయంతో క్రీమ్ ను హై స్పీడ్ మీద 4 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి, కండెన్స్డ్ మిల్క్ వేసి హై స్పీడ్ మీద మరో రెండు నిమిషాల పాటు బ్లెండర్ తో బీట్ చేసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద 12 గంటల పాటు ఫ్రీజర్ లో ఉంచాలి. తరువాత ఐస్ క్రీమ్ ను బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మృదువుగా ఉండే కొకోనట్ ఐస్ క్రీమ్ తయారవుతుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే కొకోనట్ ఐస్ క్రీమ్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.