Dhaniyala Kashayam : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగితే చాలు.. 80కి పైగా రోగాలు మాయ‌మ‌వుతాయి..!

Dhaniyala Kashayam : ఒకే ఒక్క ప‌దార్థాన్ని వాడి మ‌నం 80 కు పైగా వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. క్యాల్షియం లోపం, అధిక ర‌క్త‌పోటు, న‌రాల బ‌ల‌హీన‌త, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం, న‌రాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని ఈ ప‌దార్థం త‌గ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలన్నీ తొల‌గిపోతాయి. అరి చేతులు, అరికాళ్ల‌ల్లో మంటలు, తిమ్మిర్లను త‌గ్గించ‌డంలో, క‌డుపులో మంట‌, గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ ప‌దార్థం మ‌న‌కు సహాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ప‌దార్థం మ‌రేమిటో కాదు ధ‌నియాలు. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ధ‌నియాల‌ను పొడిగా చేసి మ‌నం అన్ని ర‌కాల వంట‌ల్లో వాడుతూ ఉంటాం.

ధ‌నియాల పొడిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ధ‌నియాల‌ను స‌రైన ప‌ద్ద‌తిలో ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ధ‌నియాల‌ను ఎలా ఉప‌యోగించ‌డం వల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ధ‌నియాల‌తో క‌షాయాన్ని చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి అందులో 2 టేబుల్ స్పూన్ల ధ‌నియాల‌ను వేసి మూత పెట్టాలి. ఈ ధ‌నియాల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే ఈ నీటిని 5 నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి టీ తాగిన‌ట్టు తాగాలి. ఈవిధంగా ధ‌నియాల క‌షాయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. న‌రాల్లో అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Dhaniyala Kashayam make like this drink daily on empty stomach
Dhaniyala Kashayam

అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య అదుపులో ఉంటుంది. ధ‌నియాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్, పొటాషియం వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ధ‌నియాల‌తో చేసిన క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గి చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ధ‌నియాల క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా ధ‌నియాల క‌షాయాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts