Crispy Aloo Bites : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వివిధ రకాల చిరుతిళ్లల్లో క్రిస్పీ ఆలూ బైట్స్ కూడా ఒకటి. ఈ ఆలూ బైట్స్ బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ ఆలూ బైట్స్ ను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ ఆలూ బైట్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ ఆలూ బైట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, బియ్యంపిండి – 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్రిస్పీ ఆలూ బైట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక బంగాళాదుంపలను తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుంటూ బంగాళాదుంప మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు నచ్చిన ఆకారంలో వత్తుకోవాలి. తరువాత వీటిని కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆలూ బైట్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా, ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ ఆలూ బైట్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినడానిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఆలూ బైట్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఒక్కటి కూడా మిగల్చకుండా ఇంట్లో అందరూ వీటిని ఇష్టంగా తింటారు.