Crispy Chicken Fry : చికెన్ ఫ్రైని క్రిస్పీగా ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Crispy Chicken Fry : చికెన్ తో మనం ర‌కర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ తో ఎక్కువ‌గా తయారు చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. ఎలా చేసిన కూడా చికెన్ ఫ్రై ఒక్క‌రోజూ లేదా రెండు రోజుల కంటే ఎక్కువ‌గా నిల్వ ఉండ‌దు. అయితే కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ ఫ్రై 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఎప్పుడు కావాల్సి వ‌స్తే అప్పుడు ఈ చికెన్ ప్రైను తిన‌వ‌చ్చు. ఈ క్రిస్పీ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అంద‌రికి ఇది ఎంతో న‌చ్చుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, నూనె – పావు కప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్.

Crispy Chicken Fry recipe very tasty how to make it
Crispy Chicken Fry

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – 500 గ్రా., ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

క్రిస్పీ చికెన్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ముక్క‌ల‌ను మ‌ధ్య‌స్థంగా క‌ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి ముక్క‌ల‌కు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ గిన్నెపై మూత పెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ చ‌క్క‌గా మ్యారినేట్ అయిన త‌రువాత ఫ్రై చేయ‌డానికి క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ ను మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ పూర్తిగా వేయించాలి. చికెన్ పూర్తిగా వేగ‌డానికి 15 నుండి 20 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. చికెన్ పూర్తిగా, క్రిస్పీగా వేగిన త‌రువాత గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, కొత్తిమీర‌ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్రిస్పీ చికెన్ ఫ్రై త‌యార‌వుతుంది . దీనిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది.

D

Recent Posts