Water Bottles Cleaning Tips : మన శరీరానికి నీరు ఎంతో అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. రోజూ 3 నుండి 4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరమని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. మనం నీటిని తాగడానికి ఎక్కువగా వాటర్ బాటిల్స్ ను ఉయోగిస్తూ ఉంటాము. ఆఫీస్ లకు వెళ్లినా, బయటకు వెళ్లినా, జిమ్ లకు వెళ్లినా మనతో పాటు వాటర్ బాటిల్స్ ను, సిప్పర్ వంటి వాటిని తీసుకు వెళ్తూ ఉంటాము. అలాగే మనలో చాలా మంది ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ ను నీటితో నింపి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత తాగుతూ ఉంటారు. మరికొందరైతే గ్లాసులు వంటివి వాడకుండా కేవలం వాటర్ బాటిల్స్ లో నీటిని నింపుకుని తాగుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా మనం నీటిని తాగడానికి వాటర్ బాటిల్స్ ను, సిప్పర్స్ వంటి వాటిని తాగుతూ ఉంటాము. అయితే ఈ వాటర్ బాటిల్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వాటర్ బాటిల్స్ పై అనేక రకాల సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ల వంటివి ఉంటాయి. అలాగే మనం వాడడం వల్ల కొన్ని సార్లు బాటిల్స్ లోపల, బాటిల్స్ లో మూతల వద్ద పాచి కూడా పేరుకుపోతుంది. ఇలా అశుభ్రమైన వాటర్ బాటిల్స్ లో నీటిని తాగడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం తరుచూ వాటర్ బాటిల్స్ ను, సిప్పర్ వంటివి వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వాటర్ బాటిల్స్ ను శుభ్రం చేయడం చాలా కష్టమైన పనే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా మనం వాటర్ బాటిల్స్ ను శుభ్రం చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్ ను సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాటర్ బాటిల్స్, సిప్పర్స్ ను శుభ్రం చేయడంలో మనకు వెనిగర్ ఎంతో సహాయపడుతుంది.
దీని కోసం బాటిల్ లో నీటిని మరియు వెనిగర్ ను సమానంగా పోసి మూత పెట్టి బాగా ఊపాలి. దీనిని గంట నుండి రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాటిల్స్ శుభ్రపడతాయి. అలాగే ఒక గిన్నెలో కొన్ని చుక్కల డిష్ వాషర్ లిక్విడ్ ను, నీటిని పోసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాటిల్స్ లో పోసి బ్రష్ తో పాచి అంతా పోయేలా బాగా కడగాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా బాటిల్స్ చాలా చక్కగా శుభ్రపడతాయి. బాటిల్స్ ను శుభ్రపరచడానికి మనం బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకుని అందులో నీటిని పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాటిల్ లోపల , బయట బ్రెష్ తో రాసి కొద్ది సేపు అలాగే ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల బాటిల్ పై ఉండే క్రిములు, మురికి, పాచి అంతా తొలగిపోతుంది. ఇక బాటిల్స్ ను ఉపయోగించడానికి మనం నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. నిమ్మరసంతో బాటిల్స్ ను శుభ్రం చేసుకోవడం వల్ల బాటిలో పై, లోపల ఉండే క్రిములు నశించడంతో పాటు బాటిల్ కూడా మంచి వాసన వస్తుంది. బాటిల్ పై ఉండే క్రిములను, మురికి, దుర్వాసనను, పాచిని తొలగించడంతో మనకు ఆపిల్ సైడ్ వెనిగర్ కూడా తోడ్పడుతుంది. బాటిల్ లో ఆపిల్ సైడ్ వెనిగర్ వేసి మూత పెట్టి బాగా షేక్ చేయాలి. దీనిని కొద్ది సేపు అలాగే ఉంచి ఆ తరువాత బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మనం వాటర్ బాటిల్స్ ను, సిప్పర్స్ ను, వాటర్ క్యాన్ లను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.