Dhaba Style Egg Curry : మనకు ధాబాలల్లో లభించే వివిధ రకాల ఎగ్ వెరైటీలలో ఎగ్ కర్రీ కూడా ఒకటి. ధాబాలల్లో చేసే ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, నాన్, బటర్ నాన్ వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పర్ఫెక్ట్ ధాబా స్టైల్ ఎగ్ కర్రీని తయారు చేసుకోవచ్చు. ధాబా స్టైల్ ఎగ్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ ఎగ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, పెరుగు – పావు కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, పసుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఫుడ్ కలర్ – 2 చుక్కలు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు- 2, జీలకర్ర – అర టీ స్పూన్, నీళ్లు -ఒక కప్పు, గరం మసాలా – అర టీ స్పూన్.
ధాబా స్టైల్ ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత వీటిని 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ఉప్పు, కాశ్మీరి కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత ఒక చిన్న కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్లను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఒక టీ స్పూన్ కారం, ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత నీళ్లు, ఉడికించిన కోడిగుడ్లు వేసి స్టవ్ ఆపన్ చేసి మూత పెట్టి ఉడికించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత గరం మసాలా వేసి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ ఎగ్ కర్రీ తయారవుతుంది. తరుచూ ఒకేరకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ ఎగ్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.