సాధారణంగా మహిళలు లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో సంపద పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి. మరి అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వారంలో అమ్మ వారికి ఎంతో ఇష్టమైన మంగళవారం, గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజలను చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది.
ఈ మూడు రోజులు ఉదయమే ఇల్లు, వాకిలి శుభ్రం చేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. అదేవిధంగా అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేయాలి. ఈ విధంగా తెల్లని పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తరం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మనం మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి దూరమవుతుంది.
కనుక లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది లక్ష్మీ కటాక్షం కలగాలంటే వారంలో ఈ మూడు రోజులు అమ్మవారికి ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలి. ముఖ్యంగా సంధ్యాసమయంలో ఇంటిలోని మహిళలు గడపపై కూర్చోవడం, ఏడవడం, సంధ్యా సమయంలో జుట్టు విరబోసుకోవడం వంటివి చేయకూడదు. ఈ విధంగా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందలేము. కనుక వారంలో ఆ 3 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అష్టోత్తరం చేయటం వల్ల ఇబ్బందులు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని, సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.