lifestyle

Navagraha : ఎలాంటి గ్ర‌హ దోషాలు అయినా స‌రే పోయి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. ఇలా చేయాలి..!

Navagraha : మ‌న చుట్టూ స‌మాజంలో జీవించే వారు ఎవ‌రైనా స‌రే.. మ‌నిషి అన్నాక స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉంటాయి. ఒక్కొక్క‌రికి ఒక్కో స‌మ‌స్య ఉంటుంది. కొంద‌రు ఉద్యోగాలు రావ‌డం లేద‌ని అంటారు. కొంద‌రు పెళ్లి జ‌ర‌గ‌డం లేదంటారు. కొంద‌రు వ్యాపారం స‌రిగ్గా జ‌ర‌గ‌డం లేదంటారు. ఇలా చాలా మందికి అనేక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అన్నింటికీ అధిక శాతం వ‌ర‌కు న‌వ‌గ్ర‌హ దోషాలే కార‌ణ‌మ‌వుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన విధంగా చేయ‌డం వ‌ల్ల న‌వ‌గ్ర‌హ దోషాల‌ను తొల‌గించుకోవచ్చు. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఏ ప‌ని చేసినా విజ‌య‌వంతంగా పూర్త‌వుతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

రోజూ గోమాత‌కు పూజ‌లు చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్త గ్ర‌హ దోషాలు తొల‌గిపోతాయి. గోమాతో అనేక మంది దేవ‌త‌లు ఉంటారు. క‌నుక గోవును పూజిస్తే ఎలాంటి దోషాలు అయినా స‌రే తొల‌గిపోతాయి. గోవుకు నుదుటిన కుంకుమ పెట్టి పూజించాలి. త‌రువాత గోవు కాళ్ల‌ను క‌డ‌గాలి. ఆ నీటిని త‌ల‌పై చ‌ల్లుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే గ్ర‌హ దోషాలు పోతాయి.

do like this to remove any type of graha dosha

ఇక గోవుకు న‌వ ధాన్యాల‌ను, ఆకుకూర‌లు, పండ్ల‌ను తినిపించ‌డం వ‌ల్ల శుభాలు క‌లుగుతాయి. ఏ ప‌ని చేసినా క‌ల‌సి వ‌స్తుంది. అలాగే గోవులు ఉండే చోట నుంచి కొద్దిగా మ‌ట్టిని సేక‌రించాలి. దాన్ని తెచ్చి ఇంట్లో ఎక్క‌డైనా పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా గ్ర‌హ దోషాలు పోతాయి. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

Admin

Recent Posts