న కుటుంబం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయ పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది. ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవడం, కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవడం, తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి. నల్లరాయి అయినా నరదృష్టికి పగులుతుంది అనే సామెత గురించి మనం వినే ఉన్నాం.
నరదృష్టి ఎంతో ప్రమాదకరమైనదని చెప్పవచ్చు. ఈ విధంగా మన కుటుంబం పైన దృష్టి పడకుండా ఉండాలంటే కొందరు ఇంటికి గుమ్మడికాయ కట్టడం లేదా కను దిష్టి వినాయకుడిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టడంవల్ల ఆ ఇంటి పైన దృష్టి పడదని భావిస్తుంటారు. వీటితోపాటు మన ఇంటిపై పడిన నర దిష్టి తొలగిపోవాలంటే కొన్ని పనులను చేయాలి.
ముఖ్యంగా ప్రతి నెలలో ఒక ఆదివారం లేదా గురువారం ఉడకబెట్టిన బంగాళాదుంపను ఆవుకు మధ్యాహ్నం 1 గంట లోపు తినిపించడం వల్ల మన ఇంటిపై పడిన నరదిష్టి తొలగిపోతుంది. అదే విధంగా అమావాస్య, పౌర్ణమి వంటి దినాలలో మన ఇంటికి నిమ్మకాయతో దిష్టి తీసి గుమ్మం దగ్గర నిమ్మకాయను కోసి పెట్టడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది. మరికొందరు అమావాస్య, పౌర్ణమి వంటి రోజులలో గుమ్మడికాయను ఇంటి ద్వారం ముందు పగలగొడతారు. ఈ విధంగా చేయటం వల్ల మన ఇంటి పై ఉన్న నరదృష్టి తొలగిపోయి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని పండితులు చెబుతున్నారు.