vastu

Vastu Tips : ఇత్త‌డి పాత్ర‌తో ఇంట్లో ఇలా చేయండి.. ధ‌నం బాగా సంపాదిస్తారు..!

Vastu Tips : ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయంటే ఆ ఇంట్లో ఉన్న వారంద‌రికీ క‌ష్టాలు వ‌స్తుంటాయి. అవి అస‌లు ఒక ప‌ట్టాన పోవు. ఇంట్లో ఉన్న అంద‌రూ ఇబ్బందులు ప‌డుతుంటారు. ముఖ్యంగా ఏ ప‌ని చేసినా అస‌లు క‌ల‌సి రాదు. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అంద‌రూ త‌రచూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటారు. ఎవ‌రి ఇంట్లో అయినా ఈ విధంగా స‌మ‌స్య‌లు వ‌స్తుంటే.. అప్పుడు వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. వెంట‌నే కింద తెలిపిన విధంగా సూచ‌న‌లు పాటించాలి. దీంతో ఇంట్లో ఎన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో వాస్తు దోషాలు పోయి క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇంట్లో ప్ర‌ధాన ద్వారం పైన మ‌ధ్య‌లో ఇత్త‌డితో తయారు చేసిన సూర్యుని బొమ్మ‌ను ఒక‌దాన్ని ఉంచాలి. సూర్యుడు స‌క‌ల ప్రాణికోటికి వెలుగునిస్తాడు. అనంత‌మైన శ‌క్తికి ఆయ‌న ప్ర‌తిరూపం. అందువ‌ల్ల ఆయ‌న బొమ్మ ఇంటి ప్ర‌ధాన ద్వారం పైన మ‌ధ్య‌లో ఉంటే.. ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. దుష్ట శ‌క్తుల నుంచి విముక్తి ల‌భిస్తుంది. ఫ‌లితంగా ఇంట్లోని వారికి క‌ష్టాలు త‌ప్పుతాయి. సూర్యుడు అన్నింటా మ‌న‌కు విజ‌యాల‌ను అందిస్తాడు. క‌నుక ఇంటి ద్వారం మీద ఆయ‌న బొమ్మ ఉంటే అన్ని విధాలుగా మ‌న‌కు శుభాలు క‌లుగుతాయి.

do like this with this vessel for money and luck

ఇక సూర్యుడి బొమ్మ కింద‌నే ఇత్త‌డితో తయారు చేసిన స్వ‌స్తిక్ బొమ్మ‌ను ఉంచాలి. ఇలా చేస్తే మ‌నం ఏ ప‌నిచేసినా విజ‌యం సాధిస్తాం. క‌ష్టాలు అస‌లు రావు. ఏ స‌మ‌స్య అయినా స‌రే ఇట్టే ప‌రిష్కారం అవుతుంది. ఇక చివ‌రిగా ఇంట్లో ఈశాన్య దిశ‌లో ఒక భారీ ఇత్త‌డి పాత్ర‌ను ఉంచాలి. అందులో మొత్తం నీళ్ల‌ను నింపాలి. 15 రోజుల‌కు ఒక‌సారి ఆ నీటిని మారుస్తుండాలి. ఇలా చేస్తే మ‌న ఇంట్లో కూడా ధ‌నం అలా క‌ల‌కాలం నిలిచి ఉంటుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు అస‌లు ఉండ‌వు. ధ‌నం మిక్కిలిగా సంపాదిస్తారు. ఈ విధంగా ఈ మూడు స‌ల‌హాల‌ను పాటిస్తే అన్ని క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts