వినోదం

Anjala Zaveri : అంజ‌లా జవేరి భ‌ర్త ఎవ‌రో తెలుసా ? షాక‌వుతారు..!

Anjala Zaveri : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు అంజ‌లా జ‌వేరి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె అప్ప‌ట్లో టాలీవుడ్ అగ్ర హీరోలు అంద‌రితోనూ యాక్ట్ చేసింది. ముఖ్యంగా చిరంజీవితో క‌ల‌సి చూడాల‌ని ఉంది, బాల‌కృష్ణ‌తో స‌మ‌ర‌సింహారెడ్డి, వెంక‌టేష్‌తో ప్రేమించుకుందాం రా.., నాగార్జున‌ల‌తో రావోయి చంద‌మామ త‌దిత‌ర చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి అంద‌రినీ మెప్పించింది. ఈ క్ర‌మంలోనే ఆమె పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ న‌టిస్తోంది. ఇక చివ‌రిసారిగా ఆమె శేఖ‌ర్ క‌మ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మూవీలో న‌టించింది.

అయితే అంజ‌లా జ‌వేరికి పెళ్లయిన‌ప్ప‌టికీ ఆమె భ‌ర్త గురించి చాలా మందికి తెలియ‌దు. ఆయ‌న టాలీవుడ్‌లోనే అనేక చిత్రాల్లో న‌టించారు. కానీ ఆయ‌న ఆమె భ‌ర్త‌నే అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. తెలుగులో అనేక చిత్రాల్లో ఆయ‌న విల‌న్‌గా న‌టించారు. ఆయనే త‌రుణ్ అరోరా. స్టైలిష్ గా ఉంటారు. మోడ్ర‌న్ విల‌న్‌గా క‌నిపిస్తారు. అయితే ఈయ‌న ఆమె భ‌ర్త అన్న విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు.

do you know about anjala zaveri husband

త‌రుణ్ అరోరా అనేక హిట్ చిత్రాల్లో విల‌న్‌గా మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150లో, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ రాయుడు, జ‌య జానకి నాయ‌క‌, అర్జున్ సుర‌వ‌రం.. త‌దిత‌ర చిత్రాల్లో త‌రుణ్ అరోరా విల‌న్‌గా చేసి అల‌రించారు. ఇక అంజ‌లా జ‌వేరి, ఈయ‌న ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వీరికి ఇప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌లు క‌ల‌గ‌లేదు.

వీరికి వివాహం అయి సుమారుగా 6 ఏళ్లు కావ‌స్తోంది. 20 ఏళ్లుగా ప్రేమించుకున్న త‌రువాత వీరు వివాహం చేసుకున్నారు. అయితే పిల్ల‌లు లేక‌పోయినా స‌రే వీరు త‌మ‌ను తామే పిల్లలుగా అనుకుని ఎల్ల‌ప్పుడూ వారిలాగే ఉంటారు. ఈ విష‌యాన్ని త‌రుణ్ అరోరానే స్వ‌యంగా చెప్పారు. ఇక అంజ‌లా జవేరి కార‌ణంగానే త‌రుణ్ అరోరాకు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని కూడా ఆయ‌న నిర్మొహ‌మాటంగా చెప్పారు.

Admin

Recent Posts