Meals : రాత్రి అన్నం తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

Meals : అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం అని పెద్ద‌లు అంటారు. ఎందుకంటే మ‌నిషి క‌ష్ట‌ప‌డేది, జీవించేది ఆ నాలుగు మెతుకుల కొర‌కే. ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా మ‌నం తిన‌గ‌లిగేది ప‌ట్ట‌డ‌న్న‌మే. అలాగే భోజ‌నాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్లు నాలుగు కూర‌ల‌తో తింటే లేనివా ళ్లు ఆ పూట‌కు గంజి ఉంటే చాల‌నుకుని భోజ‌నాన్ని కానిచ్చేస్తారు. భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం చేయ‌కూడ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయి. భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం చేయ‌కూడ‌ని ప‌నులేంటి.. అవి చేస్తే ఏమ‌వుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా భోజ‌నం చేసిన ఐదు ప‌నుల‌ను మ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు. ఆ ప‌నులేంటి అని మ‌నం తెలుసుకుని వాటిని పాటించిన‌ట్ట‌యితే అన్న‌పూర్ణాదేవి యొక్క అనుగ్ర‌హాన్ని మ‌నం పొంద‌గ‌లుగుతాం.

దీంతో మ‌నం ఏ రోజూ కూడా భోజ‌నానికి లోటు లేకుండా ఉండ‌గ‌లుగుతాం. అన్నాన్ని మ‌నం అగౌర‌వ‌ప‌ర‌చిన‌ట్ట‌యితే త‌రువాతి రోజుల్లో మ‌న‌కు అన్నం దొర‌కకుండా పోతుంది. అన్నాన్ని ఎక్కువెక్కువ వండుకుని పాడేయ‌కూడ‌దు. వీటితో పాటుగా భోజ‌నం త‌రువాత మ‌నం కొన్ని పనుల‌ను చేయ‌కుండా ఉండ‌డం మంచిది. అలా చేయ‌కుండా ఉండ‌డం వ‌ల్ల అన్న‌పూర్ణా దేవి అనుగ్ర‌హాన్ని మ‌నం పొంద‌గ‌లుగుతాం. అన్న‌పూర్ణా దేవి అనుగ్ర‌హం మ‌న మీద ఉండ‌డం వ‌ల్ల ఎంత‌టి క‌ష్టాల్లో ఉన్నా కూడా మ‌నకు మూడు పూట‌లా అన్నం దొరుకుతుంది. అన్నం మిగిలితే క‌నుక దానిని పార‌వేయ‌కుండా ప‌క్క వారికి దానం చేయాలి. ఇలా అన్న‌పూర్ణా దేవి అనుగ్ర‌హం మ‌న మీద ఉండాలంటే భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం కంచంలో చేతులు క‌డ‌గ‌కూడ‌దు.

do not do these mistakes after meals at night
Meals

తిన్న కంచంలో చేతులు క‌డ‌గ‌డ‌మ‌నేది చాలా త‌ప్పట‌. ఇది మ‌న‌కు ద‌రిద్రాన్ని క‌లిగిస్తుంద‌ని పెద్దలు చెబుతున్నారు. ఇక మ‌న‌లో కొంద‌రు భోజ‌నం చేసే కంచెంలోనే ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం అన్న‌పూర్ణా దేవి ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తుంది. కంచాన్ని, అన్నాన్ని మ‌నం ఎంతో ప‌విత్రంగా భావించాలి. ఇలా కంచంలో ఉమ్మ‌డం అనేది అన్న‌పూర్ణా దేవిని మ‌నం అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ని , అది ద‌రిద్రాహానికి హేతువు అవుతుంద‌ని పండితులు చెబుతున్నారు. అలాగే మ‌న‌లో చాలా మందికి భోజ‌నం చేసిన త‌రువాత టూత్ పిక్ ల‌తో, పిన్నీసుల‌తో నోటిని శుభ్రం చేసుకునే అల‌వాటు ఉంటుంది. ఇది చాలా ద‌రిద్ర‌పు అల‌వాట‌ని ఇలా అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని వారు సూచిస్తున్నారు. దంతాల మ‌ధ్య‌లో ఇరుకున్న‌వి బ‌య‌ట‌కు రావాలంటే నోట్లో నీళ్లు పోసుకుని నాలుగైదు సార్లు పుక్కిలించాలి. త‌ద్వారా నోరు శుభ్రం అవుతుంది.

అంతేకానీ టూత్ పిక్ ల‌ను, పిన్నీసుల‌ను ఉప‌యోగించి దంతాల‌ను శుభ్రం చేసుకోరాదు. అలాగే మ‌న‌లో కొంద‌రు భోజ‌నం చేసిన చోటే కంచాన్ని ప‌క్క‌కు జ‌రిపి నిద్ర‌పోతుంటారు. కూర్చున్న చోట నుండి క‌నీసం వారు లేవ‌రు. అలా లేవ‌కుండా అక్క‌డే ప‌క్క‌కు వాలి ప‌డుకోవ‌డం అనేది ద‌రిద్రానికి హేతువు. ఆరోగ్య‌ప‌రంగా కూడా ఇది మంచి ప‌ద్దతి కాదు. ఇలా చేయ‌డం వల్ల ద‌రిద్రం మీ చుట్టూనే ఉంటుంది. ద‌రిద్రం మిమ్మ‌ల్ని వ‌దిలి వెళ్ల‌దు. ఇక భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం చేయ‌కూడ‌ని ప‌నుల్లో ఐద‌వ‌ది చేతిని విధిలించ‌డం. భోజ‌నం చేసి చేతులు క‌డుక్కున్న త‌రువాత మ‌న‌లో చాలా మంది చేతుల‌ను విధిలిస్తూ ఉంటారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల చేయి క‌డిగిన నీళ్లు అక్క‌డున్న ప‌దార్థాల‌పై ప‌డుతూ ఉంటాయి. ఇలా చేయ‌డం ఎదుటి వారికి కూడా అస‌హ్యాన్ని క‌లిగిస్తుంది. చెయ్యి క‌డుకున్న వెంట‌నే ఏదైనా ట‌వ‌ల్ కో, వ‌స్త్రానికో చేతుల‌ను తుడుచుకోవాలి. ఇలా చేయ‌డం కూడా ద‌రిద్రానికి దారి తీస్తుంది. ఈ ఐదు ప‌నుల్లో ఏ ఒక్క‌టి చేసినా కూడా మ‌నం అన్న‌పూర్ణా దేవి ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. క‌నుక ఈ అల‌వాట్ల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మార్చుకోవాల్సిందిగా పండితులు సూచిస్తున్నారు.

D

Recent Posts