ఆధ్యాత్మికం

కాలస‌ర్ప దోషం అంటే ఏమిటో తెలుసా ? దీంతో ఏం జ‌రుగుతుంది ?

వివాహం అయ్యే వారికి కాల‌స‌ర్పం దోషం ఉందో లేదో చూస్తుంటారు. ఇది స‌హ‌జ‌మే. అయితే కాల‌స‌ర్పం దోషం అన‌గానే చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. ఈ దోషం త‌మ‌కు ఉంటే ఆందోళ‌న చెందుతారు. అయితే కాల‌స‌ర్పం దోషం వ‌ల్ల నిజానికి చెడు ఫ‌లితాలు మాత్ర‌మే కాదు, మంచి ఫ‌లితాలు కూడా క‌లుగుతాయి. అలాగ‌ని జ్యోతిష్యం చెబుతోంది.

మొత్తం న‌వ గ్ర‌హ‌కూట‌మిలో రాహు, కేతువులు కాకుండా మిగిలిన 7 గ్ర‌హాల‌న్నీ ఆ రెండు గ్ర‌హాల చ‌ట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాల‌సర్ప దోషం వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో జ‌న్మించిన వారికి ఈ దోషం క‌లుగుతుంది. అయితే ఈ దోషం వ‌ల్ల ఎల్ల‌ప్పుడూ చెడు ఫ‌లితాలు క‌ల‌గ‌వు. అప్పుడ‌ప్పుడు మంచి ఫ‌లితాలు కూడా క‌లుగుతాయి. అందువ‌ల్ల దీని గురించి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు.

do you know about kala sarpa dosham

కాల‌స‌ర్పం దోషం ఉన్న‌వారు స‌హ‌జంగానే ప‌ని బాగా చేస్తార‌ని, ధైర్యం, నిజాయితీల‌ను క‌లిగి ఉంటార‌ని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వారిలో కొంద‌రు ఉన్న‌త స్థానాల‌కు కూడా చేరుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ దోషం ఉన్న‌వారికి అనుకూలంగా ఉండే గ్ర‌హాలు కూట‌మిలోకి వ‌చ్చిన‌ప్పుడు వారి ద‌శ తిరుగుతుంది. దీంతో ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. అందువ‌ల్ల కాల‌స‌ర్ప దోషం ఉంద‌ని భ‌యం చెందాల్సిన ప‌నిలేదు.

కాల‌స‌ర్ప దోషం ఉన్న వారి జాత‌క చ‌క్రంలో సూర్యుడు రాహువుతో క‌ల‌సి 1, 2, 3, 10 స్థానాల్లో ఉంటే అప్పుడు వారికి ప‌ట్టింద‌ల్లా బంగారమే అవుతుంద‌ని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వారు కోరుకున్న‌వి నెర‌వేరుతాయి. వారి ఆరోగ్యం బాగు ప‌డుతుంది. సంప‌ద కూడా వృద్ధి చెందుతుంది. సామాజికంగా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు వ‌స్తాయి. రాజ‌కీయాల్లో రాణిస్తారు.

కాల‌స‌ర్ప దోషం ఉన్న వారి జాత‌క చ‌క్రంలో బృహ‌స్ప‌తి ఉచ్చ స్థానంలో ఉన్నా లేదంటే రాహువుతో క‌ల‌సి ఉన్నా అలాంటి వారి జీవితం ఒక్క‌సారిగా మారిపోతుంది. వారు అత్యంత ప్ర‌తిభావంతుల‌వుతారు. కుజ గ్ర‌హం కాల‌స‌ర్పం నోటి వ‌ద్ద ఉంటే అలాంటి వ్య‌క్తులు మిక్కిలి ధైర్య‌వంతులుగా ఉంటారు. అదే ఆ స్థానంలో బుధ గ్ర‌హం ఉంటే అలాంటి వారు మిక్కిలి విద్యావంతులుగా త‌యార‌వుతారు. వారు జీవితంలో అన్నింటా విజ‌యం సాధిస్తారు. ఇలా కాల‌స‌ర్పం దోషంలో గ్ర‌హాల స్థితుల‌ను బ‌ట్టి ఫ‌లితాలు మారుతుంటాయి.

Admin

Recent Posts