ఆధ్యాత్మికం

ఏ శివలింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. సాధారణంగా ఏ శివాలయం వెళ్లిన పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. భక్తులకు దర్శనమిచ్చే శివలింగంలో కూడా ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి. అయితే భక్తులు ఎవరు ఏవిధమైన లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

లింగ పురాణం ప్రకారం బ్రాహ్మణులు రసలింగాన్ని పూజించాలి. క్షత్రియులు బాణలింగాన్ని పూజించాలి. ఇక వ్యాపారమే తమ ప్రధాన వృత్తిగా భావించే వైశ్యులు స్వర్ణ లింగాన్ని పూజించాలి. ఎటువంటి మత బేధాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ స్పటిక లింగాన్ని పూజించాలి.

doing pooja to which shiva lingam gives which benefits

రత్నాజ లింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. దాత లింగం పూజించడం వల్ల భోగ వినాశనం కలుగుతుంది. శివుడికి సంబంధించినటువంటి లింగాలలో బాణలింగం ఎంతో పవిత్రమైనదని లింగపురాణం తెలుపుతోంది. బాణ లింగాలు చిన్నవిగా తెల్లని అండాకారంలో ఉంటాయి. అయితే శివలింగానికి పూజ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేయాలి.

Admin

Recent Posts