Eggless Custard Cake : ఇంట్లోనే కోడిగుడ్ల‌తో ప‌నిలేకుండా ఎంతో రుచిగా ఉండే కేక్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Eggless Custard Cake : క‌స్ట‌ర్డ్ కేక్.. మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ కేక్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే ఈ కేక్ లో కోడిగుడ్లు వేయ‌కుండా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎగ్ లెస్ క‌స్ట‌ర్డ్ కేక్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఒవెన్ లేక‌పోయినా కూడా ఈ కేక్ ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఎగ్ లెస్ క‌స్ట‌ర్డ్ కేక్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ లెస్ క‌స్ట‌ర్డ్ కేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పంచ‌దార పొడి – అర కప్పు, నూనె – పావు క‌ప్పు, పెరుగు – పావు క‌ప్పు, మైదాపిండి – ఒక క‌ప్పు, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ – 3 టేబుల్ స్పూన్స్, వంట‌సోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – అర టీస్పూన్, ఉప్పు – చిటికెడు, పాలు – అర క‌ప్పు, టూటీ ఫ్రూటీ – 2 టేబుల్ స్పూన్స్.

Eggless Custard Cake recipe in telugu make in this method
Eggless Custard Cake

ఎగ్ లెస్ క‌స్ట‌ర్డ్ కేక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పంచ‌దార పొడిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె, పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత జ‌ల్లెడ‌లో మైదాపిండి, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్, వంట‌సోడా, బేకింగ్ పౌడ‌ర్, వంట‌సోడా, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని క‌ట్ అండ్ పోల్డ్ ప‌ద్ద‌తిలో అంతా క‌లిసేలా కలుపుకున్న త‌రువాత కొద్దికొద్దిగా పాలు పోసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత టూటీ ఫ్రూటీ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గిన్నెలో లేదా కేక్ ట్రేను తీసుకుని దానికి నెయ్యి లేదా బ‌ట‌ర్ ను రాయాలి. త‌రువాత మైదాపిండిని చ‌ల్లి డ‌స్టింగ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో కేక్ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి. త‌రువాత మ‌ధ్యలో ఖాళీలు లేకుండా గిన్నెను ట్యాప్ చేసుకోవాలి. త‌రువాత పై నుండి మ‌రికొన్ని టూటీ ప్రూటీల‌ను చ‌ల్లుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ మీద వెడ‌ల్పుగా ఉండే క‌ళాయిని ఉంచి అందులో స్టాండ్ ను ఉంచాలి. త‌రువాత వీటిపై మూతను పెట్టాలి. ఇప్పుడు దీనిని చిన్న మంట‌పై 35 నుండి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 35 నిమిషాల త‌రువాత టూత్ పిక్ ను గుచ్చి చూడాలి. టూత్ పిక్ కి ఏమి అంటుకోకుండా వ‌స్తే కేక్ బేక్ అయిన‌ట్టుగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మ‌రో 5 నిమిషాల పాటు బేక్ చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెను బ‌య‌ట‌కు తీసి కేక్ ను గిన్నె అంచుల నుండి వేరు చేయాలి. త‌రువాత కేక్ ను నెమ్మ‌దిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంలో క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ లెస్ క‌స్ట‌ర్డ్ కేక్ త‌యార‌వుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా క‌స్ట‌ర్డ్ కేక్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts