Osmania Biscuits : ఉస్మానియా బిస్కెట్లు.. ఇవి తెలియని వారు, వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. టీ తింటే పాటు తీసుకుంటే ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. మనకు ప్రతి టీ షాపుల్లో ఈ బిస్కెట్లు లభిస్తాయి. అలాగే బేకరీలల్లో, షాపుల్లో కూడా ఈ బిస్కెట్లు లభిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ బిస్కెట్లను ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ బిస్కెట్లను తయారు చేసుకోవడానికి వీలు కాదు అని భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా సులభంగా ఉస్మానియా బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఒవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్లను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయటకొనే పని లేకుండా ఇంట్లోనే ఉస్మానియా బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉస్మానియా బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న బటర్ – 100 గ్రా., పంచదార పొడి – పావు కప్పు, మైదాపిండి – ఒక కప్పు, మిల్క్ పౌడర్ – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్.
ఉస్మానియా బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బటర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో పందచార పొడి వేసి బాగా కలపాలి. తరువాత జల్లెడలో మైదాపిండి, మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి జల్లించి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని అంతా కలిసేలా చక్కగా కలుపుకున్న తరువాత బటర్ పేపర్ ను తీసుకుని అందులో పిండిని ఉంచి అంతా సమానంగా వచ్చేలా రోల్ చేసుకోవాలి. తరువాత ఈ పిండి రోల్ ను 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యిని రాయాలి. తరువాత దానిపై మైదాపిండితో డస్టింగ్ చేసుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని బిస్కెట్ల ఆకారంలో కట్ చేసుకుని ప్లేట్ లో ఉంచాలి.
ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత బిస్కెట్లపై పాలతో కోటింగ్ చేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ ను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట్టాలి. ఈ బిస్కెట్లను చిన్న మంటపై 20 నుండి 25 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ బిస్కెట్లను బయటకు తీసి చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా చాలా సులభంగా ఇంట్లోనే ఉస్మానియా బిస్కెట్లను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.