House Tips : ప్ర‌తి ఇల్లాలు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన చిట్కాలు ఇవి..!

House Tips : ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అనే నానుడి మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. ఇంట్లో వ‌స్తువుల‌ను స‌ర్దుకున్న తీరు, ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచుకున్న తీరును ఇంటి ప‌రిస‌రాల‌లో చెట్ల‌ను పెంచుకునే తీరు చూస్తే మ‌న‌కు ఇల్లాలి ప‌నిత‌నం తెలిసిపోతుంది. ఇంటిని చ‌క్క‌గా ఉంచుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క ఇల్లాలికి ప‌నికి వ‌చ్చే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం సాధార‌ణంగా అర‌టి పండ్ల‌ను తిని వాటి తొక్క‌ల‌ను పాడేస్తూ ఉంటాం. కానీ ఈ తొక్క‌ల‌ను ప‌డేయ‌కుండా వాటిని ఓవెన్ లో బేక్ చేసి గులాబి మొక్క‌లకు ఎరువుగా వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొక్క‌ల‌కు త‌గినంత పొటాషియం ల‌భించి గులాబి పూలు చ‌క్క‌గా పూస్తాయి.

అలాగే ఆకుకూర‌ల కాడ‌ల‌ను త‌రిగిన త‌రువాత వాటిని ప‌డేయ‌కుండా మొక్క‌ల మొదళ్ల‌ల్లో వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అవి మొక్క‌ల‌కు మంచి ఎరువుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇంట్లో కుర్చీల వంటి వాటికి రంగు వేసేట‌ప్పుడు నాలుగు కోళ్ల కింద సీసా మూత‌ల‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వల్ల రంగు కారిన కింద నేల‌కు అంటుకోకుండా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పెంచుకునే మొక్క‌ల‌కు కీట‌కాలు చేర‌కుండా ఉండాలంటే వాటికి ఉల్లిపాయ‌ల‌ను త‌ర‌గ‌డానికి ముందు క‌డిగిన నీటితో మొక్క‌లపై పిచికారీ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీట‌కాలు చేరకుండా ఉంటాయి. ఇంట్లో దోమ‌లు, ఈగ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇంటి తుడిచే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఉప్పు వేసిన నీటితో ఇంటిని శుభ్రం చేయ‌డం వ‌ల్ల దోమ‌లు, ఈగ‌లు రాకుండా ఉంటాయి.

every woman should know these House Tips
House Tips

అలాగే ఇంటిని తుడిచే స్పాంజిని వాడిన త‌రువాత దానిని శుభ్రంగా క‌డిగి నీటిని పిండేయాలి. త‌రువాత దీనిని ప్లాస్టిక్ క‌వ‌ర్ లో చుట్టి పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎండిపోయి త్వ‌ర‌గా పావ‌కుండా ఉంటాయి. ఇళ్లు వారం రోజుల పాటు తాళం పెట్టి ఉంటే తలుపు తెర‌వ‌గానే అదో ర‌క‌మైన వాస‌న వ‌స్తుంది. ఇలా వాస‌న రాకుండా ఉండాలంటే ఒక పెద్ద ప్లేట్ లో క‌ర్పూరం వెలిగించి అన్నీ గ‌దుల్లో ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంటి లోప‌ల వాస‌న రాకుండా ఉంటుంది. వంట గ‌ది మూల‌ల్లో అక్క‌డి అల్మారాల్లో కొద్దిగా బోరిక్ పౌడ‌ర్ చ‌ల్ల‌డం వ‌ల్ల బొద్దింక‌లు రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో ఎలుక‌లు విసిగిస్తూ ఉంటే వాటి క‌లుగుల వ‌ద్ద పుదీనా ర‌సంలో ముంచిన దూదిని ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలుక‌ల బెడ‌ద తీరుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం ఇంటిని చ‌క్క‌గా ఉంచుకోవ‌డంతో పాటు అనారోగ్యాల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాం.

D

Recent Posts