Garlic Gravy : ఇంట్లో కూరగాయలు లేనపుడు 5 నిమిషాల‌లో ఇలా చేయండి.. అన్నం, చపాతీల‌లోకి సూపర్ గా ఉంటుంది..!

Garlic Gravy : మ‌నం వంట‌ల్లో వెల్లుల్లి ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా ఈ వెల్లుల్లితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వెల్లుల్లితో చేసే ఈ మ‌సాలా కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా వెల్లుల్లితో మ‌సాలా కారాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వెల్లుల్లితో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి మ‌సాలా కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెల్లుల్లి గ‌డ్డ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు క‌ప్పు, చిలికిన పెరుగు – పావు క‌ప్పు.

Garlic Gravy recipe in telugu make in this method
Garlic Gravy

వెల్లుల్లి మ‌సాలా కారం త‌యారీ విధానం..

ముందుగా వెల్లుల్లి రెబ్బ‌ల‌పై ఉండే పొట్టును తీసి వాటిని క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌ల‌పాలి. వీటిని మాడిపోకుండా చ‌క్క‌గా వేయించిన త‌రువాత ప‌సును, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌సాలాలు మాడిపోకుండా వెంట‌నే నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. పెరుగు ఉండ‌లు క‌ట్ట‌కుండా బాగా క‌లుపుకోవాలి.

చివ‌ర‌గా ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత అంతా ఒక‌సారి క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి మ‌సాలా కారం త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా వెల్లుల్లితో కారాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts