ఆధ్యాత్మికం

గరుడ పురాణం.. మ‌ర‌ణానికి ముందు మ‌న‌కు క‌నిపించే సంకేతాలు ఇవే..!

ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విష‌యం తెలిసిందే. మ‌రి దీని ప్ర‌కారం మరణం ఎవరికి ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో తెలియ‌దు. ఇంట్లో ఉన్నా కూడా మ‌ర‌ణించే అవ‌కాశం ఉంది. రోడ్డుపైన మ‌న దారిన మ‌నం జాగ్ర‌త్త‌గా వెళుతున్నా కూడా ప్ర‌మాదం మ‌న‌ల్ని వెంటాడ‌వచ్చు. అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు, పునర్జన్మ, ఆత్మ, పాపాలు మరియు పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను కచ్చితంగా తెలుసుకుంటాడు.

ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్టుగా, చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీలింగ్ వ‌స్తుంది.గరుడ పురాణం ప్రకారం, ఎవరైనా ముక్కు ముందు భాగాన్ని తన కళ్లతో చూడలేకపోతే, అది మరణం దగ్గర్లో ఉందని సంకేతం. దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే, అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయనడానికి సంకేతం. ఒక వ్యక్తి తన రెండు చెవులలో తన వేళ్లు పెట్టుకుని, ఏ శబ్దాన్ని వినలేకపోతే, అది అతని మరణం సమీపంలో ఉందని సంకేతం. గరుడ పురాణం ప్ర‌కారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే, అతను ఒక నెలలో చనిపోతాడని అర్థం.

garuda puranam signs before death

ఒక వ్య‌క్తి త‌న ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళుతున్న‌ప్పుడు కుక్క నాలుగు రోజుల పాటు వారిని అనుస‌రిస్తే వారికి మ‌ర‌ణం ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని సంకేతంగా పరిగణించబడుతుంది. ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువ అయినట్టు గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడడం ప్రారంభిస్తాడు. లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్చిన్నంగా కనిపిస్తాడు. మరణానికి ముందు వ్యక్తి చంద్రుడిని గతంలోలాగా కచ్చితంగా చూడలేడు. మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది. ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెబుతారు. చేతి రేఖలు మారతాయి. కొన్ని రేఖలు మాయమవుతాయి. మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంధీ. ముక్కు, నోరు కాస్త గట్టిగా మారుతాయి.

Sam

Recent Posts