Gobi Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌తో గోబీ మ‌సాలా కర్రీ.. త‌యారీ ఇలా.. అన్నం, చపాతీ.. ఎందులోకి అయినా బాగుంటుంది..

Gobi Masala Curry : క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే క్యాలీప్ల‌వ‌ర్ ను చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ క్యాలీప్ల‌వ‌ర్ లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా క్యాలీ ప్ల‌వ‌ర్ తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోబి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాలీప్ల‌వ‌ర్ – 500 గ్రా., చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా తరిగిన ట‌మాటాలు – 2, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Gobi Masala Curry recipe in telugu very tasty how to make it
Gobi Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్.

గోబి మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మిక్సీ జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావల్సిన ప‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ‌లు వేగిన త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి కలుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి క్యాలీ ప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను మ‌గ్గించాలి. ఇవి మ‌గ్గిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత మ‌సాలా పేస్ట్, కారం, ధ‌నియాల వేసి క‌లుపుకోవాలి.

త‌రువాత అర గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్యాలీప్ల‌వ‌ర్ మ‌సాలా కూర త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాలీప్ల‌వ‌ర్ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసిన మ‌సాలా కూర‌ను చ‌క్క‌గా తింటారు. క్యాలీప్ల‌వ‌ర్ తో ఈ విధంగా మ‌సాలా కూర‌ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts