God Puja : మనం ప్రతి రోజూ దేవున్ని ఎన్నో రకాల పువ్వులతో పూజిస్తూ ఉంటాం. ఎటువంటి పూజ చేసినా కూడా పూల దండను దేవుడి మెడలో వేస్తూ ఉంటాం. దేవుడి మెడలో, ఇంటి గుమ్మాలకు రకరకాల పూల దండలను వేలాడదీస్తూ ఉంటాం. ప్రతిరోజూ ఈ పూల దండలను వేయలేని వారు ప్లాస్టిక్ పూల దండలతో అలంకరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రతిరోజూ పూల దండను మార్చాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ఇవి ఎక్కువ రోజులు వస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. అసలు దేవుడికి ఏయే పూలతో పూజ చేయకూడదు, ఎటువంటి పూల మాలలను వేయకూడదు.. అలాగే ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలకు ఎటువంటి పూల మాలలను వేయకూడదు.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో దేవుడి ఫోటోలకు కానీ, పెద్ద వారి ఫోటోలకు కానీ ప్లాస్టిక్ పూల మాలలను అస్సలు వేయకూడదు. ప్లాస్టిక్ పువ్వులను కూడా పెట్టకూడదు. ఎప్పటికప్పుడు తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూల దండలను వేయడం వల్ల అరిష్టం వాటిల్లుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ, దండలను కానీ ఎటువంటి ఫోటోలకు వేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏవిధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడట.
రోజూ తాజా పువ్వులను సమర్పించి పూజ చేయడం వల్ల మనుషులల్లో కోపం, క్రూరత్వం తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించడం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలగవు. తాజా పువ్వులను భగవంతునికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. ఇంట్లో ఉండే ఎటువంటి ఫోటోలకైనా సరే ప్లాస్టిక్ పువ్వులను, ప్లాస్టిక్ పూల మాలలను వేయకూడదని.. దీని వల్ల మనకు చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.