Gongura Rice : గోంగూర‌తో ఇలా రైస్ చేసి పెడితే.. ఎవ‌రైనా స‌రే వ‌ద్ద‌న‌కుండా తింటారు..!

Gongura Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఈ రైస్ వెరైటీలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో గోంగూర రైస్ కూడా ఒక‌టి. గోంగూర‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చ‌క్క‌గా ఉంటుంది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే ఈ గోంగూర రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర రైస్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

అన్నం – పావు కిలో బియ్యంతో వండినంత‌, గోంగూర – 2 గుప్పెళ్లు, నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, ల‌వంగాలు – 4, సాజీరా – అర టీ స్పూన్, జాపత్రి – కొద్దిగా, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Gongura Rice recipe very tasty everybody likes it
Gongura Rice

గోంగూర రైస్ త‌యారీ విధానం..

ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో గోంగూర‌ను వేసి మంట‌ను చిన్న‌గా చేసి మూత పెట్టి మ‌గ్గించాలి. గోంగూర మ‌గ్గిన త‌రువాత గంటెతో అంతా క‌లుపుకుని గోంగూర‌ను మెత్త‌గా చేసుకోవాలి. దీనిని జార్ లో మెత్త‌గా పేస్ట్ లాగా కూడా చేసుకోవ‌చ్చు. ఇప్పుడు క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. వీటిని నిమిషం పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న గోంగూర మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించిన త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వేడి వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర రైస్ త‌యార‌వుతుంది. దీనిని రైతా, ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన గోంగూర రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts