వినోదం

NTR In God Getups : ఎన్‌టీఆర్ త‌న సినిమా కెరీర్‌లో వేసిన దేవుళ్ల గెట‌ప్‌లు ఎన్నో తెలుసా..?

NTR In God Getups : విశ్వ విఖ్యాత నట సర్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఈ తరం వారికి చాలా తక్కువగా తెలుసు. అయన సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేశారు. అటువంటి ఎన్టీఆర్ గురించి ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ విజయవాడలో ఇంటర్ మీడియేట్ చదువుకొనే రోజుల్లో కుటుంబ అవసరాల కోసం పాలను హోటల్స్ కి సరఫరా చేసేవారు. విజయవాడలో చదువుకొనే సమయంలోనే ముఖానికి రంగు వేసుకొని మొదటిసారిగా స్త్రీ వేషం వేశారు.

ఎన్టీఆర్ 1949 లో వచ్చిన మన దేశం సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమాలో పోషించిన పోలీస్ పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేనిది. 1963 లో విడుదల అయిన బృహన్నల సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కూచిపూడి డాన్స్ బేసిక్స్ ని నేర్చుకున్నారు. ఎన్టీఆర్ ఒకే సినిమాలో రాముడు, రావణాసురుడు పాత్రలను పోషించి అభిమానులు, విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో దాదాపుగా 17 హిందూ దేవుళ్ళ గెటప్ లను వేశారు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనే భావన ప్రేక్షకుల్లో వచ్చేసింది.

how many god getups sr ntr did

ఎన్టీఆర్ హీరోగా మంచి స్థితిలో ఉన్నప్పుడే బ్యానర్ స్థాపించి సినిమాలకు దర్శకత్వం, నిర్మాణ సారథ్య‌ బాధ్యతలను తీసుకున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో మూడు నేషనల్ అవార్డ్ లను గెలుచుకున్నారు. అయితే అవి నటుడిగా రాలేదు. అందులో ఒకటి దర్శకత్వానికి, మిగిలిన రెండు నిర్మాతగా వచ్చాయి. ఇక రాజకీయ జీవితానికి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన నడిచిన విధానం చాలా మందికి ఆదర్శం అయ్యింది. ఎన్టీఆర్ 1968 లో పద్మ శ్రీ అవార్డ్ ని కేంద్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు.

Admin

Recent Posts