మనం నిత్యం వంటలలో ఉపయోగించే మసాలా దినుసు, సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటిగా ఉంది. మంచి రుచి, వాసనతో పాటు దాల్చిన చెక్క మన శరీరంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. అయితే దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం, అదీ ఉదయం పరగడుపున తీసుకోవటం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.దాల్చినచెక్క బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించి, విషాలకు విరుగుడుగా దాల్చిన చెక్కను పొడిగా చేసిగాని, దాల్చిన చెక్క రసాన్ని గాని తీసుకోవాలి
అయితే మీరు వాడుతున్న దాల్చిన చెక్క నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. మార్కెట్‌లో సాధారణంగా కనిపించే దాల్చినచెక్క బెరడు వలె కనిపిస్తుంది, విస్తృత ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది . దాల్చినచెక్కకు చౌకగా ప్రత్యామ్నాయంగా దీనిని అమ్ముతుంటారు. కాసియాగా పిలవబడే ఈ దాల్చిన చెక్కలో కౌమరిన్ ఎక్కువ మొత్తంలో ఉంది, ఇది అధిక మోతాదులో మీ ఆరోగ్యానికి విషపూరితం కావచ్చు. మీరు దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే, మీరు తప్పనిసరిగా నిజమైన దాల్చినచెక్కను ఉపయోగించాలి.. కాసియా కూడా అచ్చం దాల్చిన చెక్క మాదిరిగానే ఉంటుంది. కాని ఇది తీసుకుంటే కిడ్నీపై ఎఫెక్ట్ పడుతుంది.
చైనా, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు తక్కువ ధరికి వాటిని దిగుమతి చేస్తుండగా, ఇక్కడి వినియోగదారులు వాటిని కొనుగోలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీనిని బ్యాన్ చేశాయి. 12 వేల టన్నుల డిమాండ్ మనదేశంలో ఉండడంతో ఇలా కాసియోని దిగుమతి చేసుకొని మోసం చేస్తున్నారంటూ కొందరు నిపుణులు చెప్పుకొస్తున్నారు. నిజమైన దాల్చినచెక్క బయట మృదువుగా ఉంటుంది.ఒక వార్తాపత్రిక వలె ఒక వైపు నుండి మరొక వైపుకు చుట్టబడి ఉంటుందని అంటున్నారు. ఇది చాలా మంచి వాసన మరియు రుచిని కూడా కలిగి ఉంటుంది. మీరు దాల్చిన చెక్క నీటిని తాగుతున్నట్లయితే, ఒరిజినల్ దాల్చినచెక్కను ఎంచుకోండి. ఒకవేళ కూరకి అయితే కాసియోని మితంగా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు.