ఆధ్యాత్మికం

Lakshmi Devi : ఈ వస్తువుల‌ను దానం చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో ఉండ‌దు..!

Lakshmi Devi : జోతిష్య శాస్త్రంలో దాన ధ‌ర్మాల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దానం చేయ‌డం వ‌ల్ల మ‌న జాతకంలో గ్ర‌హాల ప్ర‌భావం త‌గ్గుతుంది. దీంతో స‌మ‌స్య‌ల నుండి మ‌న‌కు చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే మ‌నం అవ‌స‌ర‌మైన వారికి వారి అవ‌స‌రాన్ని బ‌ట్టి మాత్ర‌మే దానం చేయాలి. విరాశాలు ఇవ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌న‌కు ఎక్కువ పుణ్య‌ఫ‌లితాలు ల‌భిస్తాయి. అలాగే దానం చేసేట‌ప్పుడు నిస్వార్థంగా, ఆనందంగా దానం చేయాలి. దుఃఖంతో, ద్వేషంతో చేసే దానాల‌కు ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు. ఏది ఏమైన‌ప్ప‌టికి జోతిష్య శాస్త్రం ప్రకారం మ‌నం కొన్ని వ‌స్తువుల‌ను ఎప్పుడూ కూడా దానం చేయ‌కూడ‌దు. వీటిని దానం చేయడం వ‌ల్ల మ‌నం పుణ్యానికి బ‌దులుగా పాపాన్ని మూట క‌ట్టుకోవాల్సి వ‌స్తుంది.

అలాగే భ‌గ‌వంతుడి కోపానికి కూడా గురి కావాల్సి వ‌స్తుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం మ‌నం దానం చేయ‌కూడని కొన్ని వ‌స్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవ‌నూనెను దానం చేయ‌డం మంచిది. చాలా మంది ఆవ‌నూనెను దానం చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రు వాడిన ఆవ‌నూనెను కూడా దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం అస్స‌లు మంంచిది కాదు. పుణ్యానికి బ‌దులు పాపం వ‌స్తుంది. మ‌నం శ‌ని దేవుని కోపానికి గురి కావాల్సి వ‌స్తుంది. అలాగే ప‌సుపును సూర్యాస్త‌మ‌యం త‌రువాత దానం చేయ‌కూడ‌దు. ప‌సుపును బృహస్ప‌తికి సంబంధించిన‌దిగా భావిస్తారు. క‌నుక గురువారం నాడు ప‌సుపును దానం చేయ‌డం వ‌ల్ల బృహ‌స్ప‌తి బ‌ల‌హీనప‌డుతుంది. దీని వ‌ల్ల మ‌నం జీవితంలో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

if you are donating these items then must know

అదేవిధంగా జోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం ఉప్పును కూడా దానం చేయ‌వ‌ద్దు. ఉప్పును దానం చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తుంది. ల‌క్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అలాగే పాత్ర‌ల‌ను కూడా ఎప్పుడూ దానం చేయ‌వ‌ద్దు. ఏ లోహంతో త‌యారు చేసిన పాత్ర‌ల‌ను కూడా దానం చేయ‌వ‌ద్దు. పాత్ర‌ల‌ను దానం చేయ‌డం వ‌ల్ల వ్యాపారంలో న‌ష్టం వ‌స్తుంది. కుటుంబం యొక్క ఆనందం, శాంతి అంతా కూడా ప్ర‌మాదంలో ప‌డుతుంది. అలాగే పుణ్యం వ‌స్తుంద‌ని చాలా మంది మ‌త గ్రంథాల‌ను దానంగా ఇస్తూ ఉంటారు. మ‌త గ్రంథాల‌ను దానం చేసేట‌ప్పుడు పాత వాటిని, చిరిగిన వాటిని దానం చేయ‌కూడ‌ద‌ని గుర్తుంచుకోవాలి. చిరిగిన మ‌త గ్రంథాల‌ను దానం చేయ‌డం వ‌ల్ల ఇంట్లోకి దుర‌దృష్టం వ‌స్తుంద‌ని జోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts