Dream : హిందూ శాస్త్ర ప్రకారం కొన్ని కార్యాలు కొన్ని నియమాల ప్రకారం చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఇలా ఉదయం నిద్రలేచిన తరువాత కొన్నింటిని చూడడం వల్ల మనం సత్ఫలితాలను పొందవచ్చు. ఉదయం లేచిన వెంటనే వీటిని చూడడం వల్ల అనుకున్నది జరగడంతో పాటు మనకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే మనకు కలలో కొన్ని వస్తువులు కనిపించడం వల్ల మేలు కలుగుతుంది. అలాగే కలలో కనిపించకూడని వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. అసలు ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే మంచిది. అలాగే కలలో ఏవి కనిపిస్తే శుభం కలుగుతుంది.
కలలో రాకూడనివి ఏంటివి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే సూర్యుడు, ఎర్ర రంగు వస్తువులు, బంగారం, దీపం, తామర పువ్వు, పొలం, సముద్రం వంటి వాటిని చూస్తే మనం కార్యాలు నెరవేరుతాయి. అలాగే గంధం, దూడ కలిగిన ఆవు, మేఘాలతో కప్పబడిన పర్వతాలను, మంగళ తోరణాలను, పసుపు బట్టలను, మంగళ సూత్రాన్ని, గాజులను, పసుపు, కుంకుమలను, తులసి చెట్టును, పూల మొక్కలను వీటిలో దేనిని చూసిన కూడా శుభం కలుగుతుందట. ఉదయం లేవగానే మనం వీటిని చూడడం వల్ల మనం అనుకున్న కార్యాలు నెరవేరడంతో పాటు మనకు ఎంతో శుభం కలుగుతుంది. అదేవిధంగా కలలో గుర్రం, రథం, ఏనుగు, నీరు, రాజు, ఆవు, దీపం, అన్నం, ఫలాలు, పుష్పాలు, కన్య స్త్రీ, అగ్ని, వేశ్య, తెల్ల పాము, మాంసం, గంగా స్నానం, దైవ దర్శనం, పూర్ణ కుంభం వంటివి కనిపిస్తే మనకు ఎంతో మేలు కలుగుతుంది.
ఇవి కలలో కనిపించడం వల్ల మనకు ఆరోగ్యం, ధన లాభం కూడా కలుగుతుందట. ఇక కలలో కనిపించకూడనివి కూడా ఉంటాయి. ఇవి కలలో కనిపించడం వల్ల చెడు జరుగుతుందని భావిస్తారు. కలలో క్రూర జంతువులు, కోతి తరమడం, ఉప్పు, ఇనుము, దొంగలు, రక్షక భటులు, బురద, నీటిలోయందు మునగటం, రోగం వచ్చినట్టు కనబడడం వంటివి కలలో కనబడకూడదు. ఇవి కలలో కనబడడం వల్ల మనకు కీడు కలుగుతుందట. మనం అనారోగ్య సమస్యలతో బాధపడడంతో పాటు అనుకున్న పనులు నెరవేరకపోవడం వంటివి కూడా జరుగుతాయట.