lifestyle

Sleep : నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటే.. దరిద్రమే..!

Sleep : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. బాధలు అనుభవించాలని, కష్టాలు పాలవ్వాలని ఎవరికీ ఉండదు. కానీ చాలామంది చేసే కొన్ని పొరపాట్ల వలన కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధలను భరించాల్సి వస్తుంది. మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తాయి. మనం తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

ఆ నియమాలను మనం పాటించడం వలన, చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. కష్టాలన్నీ పోతాయి. ఆనందంగా ఉండొచ్చు. నిద్రపోయేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు చూద్దాం. నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులని అస్సలు మీ దగ్గర పెట్టుకోవద్దు. దీని వలన దరిద్రం వస్తుంది. ఈ తప్పులు చేయడం వలన డబ్బులు త్వరగా ఖర్చు అయిపోతాయి. స్థిరంగా ఏ పని మీద దృష్టి పెట్టలేరు. ఆనందంగా జీవించలేరు.

when you sleep do not keep these items near you

ఆర్థికంగా వెనకబడి పోతారు. నిద్రపోయేటప్పుడు కాళ్ళని దక్షిణం వైపు పెట్టుకోకూడదు. ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ, మీ కాళ్ళని పెట్టి నిద్రపోవచ్చు. పడుకునేటప్పుడు తల దగ్గర నీళ్ళని పెట్టుకుని అసలు నిద్రపోకూడదు. అది కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మంచం కింద చెప్పులు పెట్టుకుని నిద్రపోకూడదు. నిద్రపోయేటప్పుడు చెప్పులని మంచం కింద పెట్టుకోవడం వలన చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయట.

కాబట్టి ఈ పొరపాటున కూడా అసలు చేయకండి. అలానే వాస్తు ప్రకారం మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అద్దం ఉంటే కూడా ఇబ్బందులు వస్తాయి. నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటే, దరిద్రం కలుగుతుంది. కాబట్టి ఈ పొరపాటుని కూడా చేయకండి. తల కింద పుస్తకాలు పెట్టుకుని కూడా నిద్రపోకూడదు. ఇటువంటి పొరపాట్లని అస్సలు చేయకండి. అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు.

Admin

Recent Posts