జబర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించకపోవడంతో మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించి సందడి చేసేవారు. అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో బాగానే సంపాదించాడు. అంతేకాదు శాంతి స్వరూప్ ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అయితే ఇన్నాళ్లు తనకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనకు నవ్వుతూ పంచిన శాంతి స్వరూప్ తనకు సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకొని అందరి కంట కన్నీరు పెట్టించాడు.
సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్కి జబర్దస్త్ లో లేడీ గెటప్లతో పాపుల్ అయిన శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయిలేఖ వచ్చారు. వీరు తమ మదర్, పాదర్లతో కలిసి సందడి చేశారు. అనంతరం ఓ సందర్భంలో.. శాంతి స్వరూప్ జబర్దస్త్ కి రాకముందు ఎలాంటి బాధలు పడ్డారో వెల్లడించారు. తమ ఫ్యామిలీ ఎలాంటి ధీన స్థితి లో ఉండేదో చెప్పుకొచ్చాడు. తన తల్లి సరోజనమ్మ తాము చిన్నప్పుడు అమ్మ ఇంటింటికి తిరిగి పాచిపనులు చేసేదని పేర్కొన్నారు. అంట్లు తోమి తమని పోషించందన్నాడు. అంతేకాదు ఆ సమయంలో తాము ఆకలి బాధలను అనుభవించినట్టు చెప్పాడు.
అమ్మ చాలా ఇళ్లల్లో పాచి పనులు, ఆంట్లు తోమేది. అప్పుడు మాకు ఆకలి బాధ ఎలా ఉండేదంటే? అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అమ్మకి గొంతు సరిగా లేదని, ఆమె సరిగా మాట్లాడలేదని తెలిపాడు. ఏదో మాట్లాడాలనుకుంటుంది. కానీ మాట్లాడలేదు అంటూ తన తల్లి గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక తన కొడుకే తనని బతికిస్తున్నాడని, ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాడని చెబుతూ ఆమె కూడా బోరున విలపించింది. ఆ వీడియో అందరిని కదిలిచింది. శాంతి స్వరూప్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అని ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు.