Jilledu For Rats : ఇలా చేస్తే.. జ‌న్మ‌లో ఎలుక‌లు మీ ఇంట్లోకి రావు..!

Jilledu For Rats : మ‌న ఇంట్లోకి ప్ర‌వేశించి సంచ‌రించే జీవుల్లో ఎలుక‌లు ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి స‌మ‌స్య కొంత‌మేర తగ్గించ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికి కొంద‌రిని మాత్రం ఇవి తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇంట్లోకి వ‌చ్చి ఏది దొరికితే అది కొరికి న‌మిలి ప‌డేస్తూ ఉంటాయి. ఆహారాల‌ను, స‌రుకుల‌ను కొర‌క‌డంతో పాటు వీటి కార‌ణంగా ప్రాణాంత‌క వ్యాధులు ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతాయి. వీటి వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. చాలా మంది ఎలుక‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎలుక‌ల మందు, బోను, గ్లూ మ్యాట్ వంటి వాటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ చిన్న పిల్ల‌లు ఉన్న చోట వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఎలుక‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎలుక‌ల‌ను త‌రిమే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా నూనెను ఇంటి మూల‌ల్లో ఇంట్లో అక్క‌డ‌క్క‌డ చ‌ల్ల‌డం వ‌ల్ల ఎలుక‌లు రాకుండా ఉంటాయి. దీని ఘాటైన వాస‌న కార‌ణంగా ఎలుక‌లు ఇంట్లో నుండి బ‌య‌ట‌కు పోతాయి. అలాగే ల‌వంగాల వాస‌న కూడా ఎలుకలుకు అంత‌గా న‌చ్చ‌దు. క‌నుక ఎలుక‌లు ఎక్కువ‌గా తిరిగే ప్ర‌దేశాల ద‌గ్గ‌ర ల‌వంగాల‌ను ఉంచ‌డం వ‌ల్ల లేదా ల‌వంగాల నూనెను ఉంచ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా ఒక ప‌లుచ‌టి వ‌స్త్రంలో కారాన్ని వేసి మూట క‌ట్టాలి. ఈ మూట‌ను ఎలుక‌లు ఉండే చోట, ఎలుక‌లు ఇంట్లోకి ప్ర‌వేశించే చోట ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలుకలు రాకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయ‌ల వాస‌న కూడా ఎలుక‌ల‌కు అంత‌గా న‌చ్చ‌దు. ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి ఎలుక‌లు తిరిగే చోట అక్క‌డ‌క్క‌డ ఉంచ‌డం వ‌ల్ల ఉల్లిపాయ‌ల నుండి వ‌చ్చే వాస‌న కార‌ణంగా ఎలుకలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

Jilledu For Rats know how to get rid of them
Jilledu For Rats

అలాగే బేకింగ్ సోడాను చ‌ల్ల‌డం వల్ల కూడా ఇంట్లో ఉండే ఎలుకలు పారిపోతాయి. ఎలుకలు ఎక్కువ‌గా తిరిగే చోట‌, ఇంట్లో మూల‌ల‌కు బేకింగ్ సోడాను చ‌ల్ల‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే జిల్లేడు పాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం ఎలుక‌ల‌ను త‌రిమికొట్ట‌వ‌చ్చు. పంట పొలాల‌ను పాడు చేసే ఎలుకల‌ను త‌రిమికొట్ట‌డంలో ఈ చిట్కా మ‌న‌కు ఎక్కువగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక జార్ లో మినుములు, నువ్వులు వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఒక పొడికి త‌గిన‌న్ని జిల్లేడు పాల‌ను క‌లిపి ఉండలుగా చేయాలి. అయితే జిల్లేడు పాల‌ను ఉప‌యోగించేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఇలా తయారు చేసిన ఉండ‌ల‌ను ఎలుకలు తిరిగే చోట‌, ఎలుక క‌లుగుల్లో ఉంచాలి. ఈ ఉండ‌ల‌ను తిన్న వెంట‌నే వీటిలో ఉన్న జిల్లేడు పాల కార‌ణంగా ఎలుక‌లు నశిస్తాయి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మ‌నం ఎలుక‌ల బెడ‌ద నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts